Home /News /sports /

HYDERABAD SPRINTING PRODIGY AMLAN BORGOHAIN IMPROVES PERSONAL BEST TWICE AT FEDERATION CUP SRD

Amlan Borgohain : ఫెడరేషన్ కప్ లో తన రికార్డును తానే అధిగమించిన హైదరాబాద్ స్ప్రింటర్

Amlan Borgohain : ఫెడరేషన్ కప్ లో తన రికార్డును తానే అధిగమించిన హైదరాబాద్ స్ప్రింటర్

Amlan Borgohain : ఫెడరేషన్ కప్ లో తన రికార్డును తానే అధిగమించిన హైదరాబాద్ స్ప్రింటర్

Amlan Borgohain : జాతీయ క్రీడా యవ్వనిక సత్తా చాటుతున్న తెలంగాణ కుర్రాడు. హైదరాబాద్ కి యంగ్ స్ప్రింటర్ అమ్లాన్ బోర్గోహైన్ (Amlan Borgohain ) ప్రదర్శనలు చూస్తే భవిష్యత్తు ఆశాకిరణంగా కన్పిస్తున్నాడు. ఈ కుర్రాడి ఇలాగే సత్తా చాటితే భారత్ కు పతకాలు రావడం ఖాయం.

ఇంకా చదవండి ...
    ఒడిశా రిలయన్స్ అథ్లెటిక్స్ (Reliance Foundation Odisha Athletics) హై పర్ఫార్మెన్స్ సెంటర్ లో (HPC) ట్రైనింగ్ తీసుకుంటున్న తెలంగాణ స్ప్రింటర్ అమ్లాన్ బోర్గోహైన్ (Amlan Borgohain) తన ప్రదర్శనతో సత్తా చాటుతున్నాడు. 24 వ జాతీయ ఫెడరేషన్ కప్ లో తన రికార్డుల్ని తానే అధిగమిస్తూ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాడు. 100 మీ స్ప్రింట్ లో రెండు సార్లు వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు ఈ తెలంగాణ స్ప్రింటర్. మొదట సారి 10.59 సెకన్లలో పరుగును పూర్తి చేస్తే.. రెండో సారి సెమీఫైనల్ లో దాన్ని కేవలం 10.44 సెకన్లలో పూర్తి చేసి వారెవ్వా అన్పించాడు. గతంలో బోర్గోహైన్ అత్యుత్తమ టైమింగ్ 10.68 సెకన్లు. ఫెడరేషన్ కప్ లో ఇప్పుడు ఆ టైమింగ్ ను రెండు సార్లు బ్రేక్ చేశాడు ఈ తెలంగాణ కుర్రాడు. 2021 ఆగస్ట్ లో జరిగే వరల్డ్ యూనివర్శిటి గేమ్స్ లో అర్హత సాధించే వారిలో మూడో స్థానంలో ఉన్నాడు. హెడ్ కోచ్ జేమ్స్ హిల్లీయర్ అమ్లాన్ ను 100 మీ పరుగుతో పాటు 4 x 100m రిలేలో ప్రాతినిధ్యం వహించేలా ఒప్పించారు. " ఈ సంవత్సరం ప్రారంభంలో మేము అమ్లాన్ కోసం ప్రత్యేక వార్షిక ప్రణాళిక రూపొందించాం. దాన్ని ఆధారంగా జూన్ సీజన్ లో అతని ఎంపిక ఉంటుంది " అని జేమ్స్ హిల్లీయర్ తెలిపారు. " అయితే, రిలయన్స్ సెంటర్ లో అమ్లోన్ ప్రదర్శించిన డేటాతో ఈ సీజన్ లో ఫెడ్ కప్ లో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నాం. కేవలం 10 వారాల సన్నద్ధత మరియు నిర్దిష్ట రేసు తయారీ తరువాత, అమ్లాన్ రెండు వ్యక్తిగత బెస్ట్ లను రికార్డ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన పట్ల టీమ్ మొత్తం సంతోషంగా ఉన్నాం " అని తెలిపారు జేమ్స్ హిల్లీయర్.

    22 ఏళ్ల బోర్గోహైన్.. అతని కుటుంబం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. అతని తండ్రి 2009 లో రిటైర్ అయిన దగ్గర నుంచి వారు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. అమ్లోన్ ఫెడరేషన్ కప్ లో సత్తా చాటుతున్న యంగ్ డైనమైట్లలో ఒకడు. 2020 ఏప్రిల్ నుంచి అతని శిక్షణ భువనేశ్వర్ లోని రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నడపబడుతున్న HPC లో జరుగుతోంది. HPC అనేది కుర్రాళ్లలో టాలెంట్ బయటి తీయడానికి స్థాపించబడింది. ఒడిశా ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ దీన్ని నడుపుతోంది. అక్కడున్న అథ్లెట్ల అవసరాల్ని ఈ సంస్థ దగ్గర ఉండి చూసుకుంటోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత అమ్లాన్ బోర్గోహైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ప్రింటర్ గా తయారయ్యాడు.

    " పరుగు పందెంలో కొద్ది సెకన్ల తేడానే గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయ్. అమ్లాన్ కు 100 మీ రేస్ బెస్ట్ అనుకున్నాం. 200 మీటర్ల స్ప్రింట్ కన్నా అతడు ఇందులోనే రాణిస్తాడని భావించాం. అందుకు తగ్గట్టుగానే అతని ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయ్ " అని కోచ్ జేమ్స్ హిల్లీయర్ తెలిపారు. " HPC కి వచ్చినప్పుడు ఎలా ట్రైన్ అవ్వాలో తన దగ్గర ఎటువంటి ఆలోచన లేదు. కానీ, ఇప్పుడు కోచ్ లు, న్యూట్రిషియన్ల సహాయంతో నన్ను నేను మెరుగుపర్చుకున్నాను. పరుగు పందాల్లో పాల్గొనేటప్పుడు నాకు కొంచెం భయంగా ఉండేది. కానీ, నిపుణుల ఇచ్చిన ధైర్యంతో దాన్ని అధిగమించాను. కోచింగ్ స్టాఫ్ కి ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని అమ్లాన్ తెలిపాడు.

    ఫెడరేషన్ కప్ లో సత్తా చాటిన తర్వాత అమ్లాన్ ఇప్పుడు మళ్లీ HPC కి తిరిగొచ్చాడు. వచ్చే జూన్ కోసం తన ప్రణాళికల్ని మెరుగుపర్చుకుంటున్నాడు. తనకు తానే టార్గెట్ లు విధించుకుని పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు అమ్లాన్. ఇదే స్పూర్తితో 2022లో కామెన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం కోసం ప్లాన్ తయారుచేసుకుంటున్నాడు ఈ యంగ్ స్ప్రింటర్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Hyderabad, Reliance Foundation, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు