Home /News /sports /

HYDERABAD CRICKETER T DILIP SET TO APPOINT AS TEAM INDIA FIELDING COACH HE WILL WORK ALONG WITH RAHUL DRAVID JNK

Team India Fielding Coach: టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా తెలంగాణ క్రికెటర్.. రాహుల్ ద్రవిడ్ బృందంలో చోటు

టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా తెలంగాణ క్రికెటర్ (PC: Twitter)

టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా తెలంగాణ క్రికెటర్ (PC: Twitter)

T Dilip as Fielding Coach: టీమ్ ఇండియా సపోర్టింగ్ స్టాఫ్ నియామకం తుది దశకు చేరుకున్నది. హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్‌ను టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించనున్నది. ఈ మేరకు క్రికెట్ అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకున్నది.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) ప్రధాన కోచ్‌గా (Head Coach) మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగనున్న సిరీస్ నుంచి ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా పని ప్రారంభించనున్నాడు. రవిశాస్త్రి (Ravi Shastri) హెడ్ కోచ్ పదవీ కాలం ముగియడంతో అతడితో పాటు పని చేసిన సపోర్టింగ్ స్టాఫ్ (Supporting Staff) గడువు కూడా తీరిపోయింది. దీంతో కొత్త హెడ్ కోచ్‌తో పాటే కోచింగ్ స్టాఫ్ కోసం కూడా బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటే సహాయక సిబ్బంది విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, శ్రీధర్ పదవీ కాలం ముగిసింది. దీంతో వారి స్థానంలో కొత్త వారి నియామకానికి బీసీసీఐ కసరత్తు చేసింది. పాత వారిలో కేవలం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) రాథోడ్‌కు మారోసారి అవకాశం కల్పించింది. ఇక బౌలింగ్ కోచ్‌గా పరాస్ మంబ్రేను ఎంపిక చేశారు. రాహుల్ ద్రవిడ్‌తో కలసి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ)లో పని చేయడమే కాకుండా.. అతడికి మంచి అనుభవం ఉండటంతో సీఏసీ పచ్చ జండా ఊపింది.

    ఇక ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీదర్ స్థానంలో దిలీప్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తెలంగాణకు చెందిన టి. దిలీప్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్నది. 14 ఏళ్ల తన కోచింగ్ కెరీర్‌లో ఇండియా అండర్ - 19, ఫస్ట్ క్లాస్ జట్లకు కోచ్‌గా పని చేశాడు. ఇటీవల భారత జట్టు శ్రీలంకలో పర్యటించిన సమయంలో తాత్కాలిక ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. దిలీప్ తన క్రికెట్ కెరీర్‌లో హెచ్‌సీఏ ఏ-డివిజన్ లీగ్స్‌లో కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ తరపున పలు మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ కెరీర్ అనంతరం బీసీసీఐ లెవెల్-3 శిక్షణను పూర్తి చేసుకున్న దిలీప్ ఆ తర్వాత పూర్తి స్థాయి కోచ్‌గా మారాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న పలువురు యువకులకు ఫీల్డింగ్ మెలకువలు నేర్పిన అనుభవం దిలీప్‌కు ఉన్నది.

    Rizwan In ICU: సెమీస్‌కు 48 గంటల ముందు ఐసీయూలో.. ఏం గుండె ధైర్యం రిజ్వాన్ నీది.. గెలిచేశావ్‌పో..




    భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌గా విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్), పరాస్ మంబ్రే (బౌలింగ్) ఖరారు అయినా.. ఫీల్డింగ్ కోచ్ విషయంలోనే తర్జన భర్జనలు జరిగినట్లు తెలుస్తున్నది. ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను తీసుకోవాలని రాహుల్ ద్రవిడ్ సూచించినట్లు సమాచారం. అంతే కాకుండా సీఏసీ ముందుకు సులక్షణ నాయక్, ఆర్పీ సింగ్ పేర్లు కూడా వచ్చాయి. ఎన్ఏసీలో రాహుల్ ద్రవిడ్ కొలీగ్, ఇండియా-ఏ, ఇండియా అండర్ - 19 జట్లకు పని చేసిన అభయ్ శర్మను తీసుకుంటారని అందరూ భావించారు. కానీ శ్రీలంక పర్యటనలో టి. దిలీప్ పని తీరుపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత రాహుల్‌కు ఆ నిర్ణయాన్ని చెప్పారు. ఆ పర్యటనలో దిలీప్‌ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్.. చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్ నియామకం ఖరారయ్యింది.

    PAK vs AUS: పాక్‌కు షాక్... హ్యాట్రిక్ సిక్స్‌లతో ఆస్ట్రేలియాకు గ్రాండ్ విక్టరీని కట్టబెట్టిన మ్యాథ్యూ వేడ్




    హైదరాబాద్‌కు చెందిన టి. దిలీప్ భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైనట్లు హెచ్‌సీఏ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తెలుగు వాడికి జాతీయ స్థాయిలో మంచి బాధ్యతలు దక్కడంపై హెచ్‌సీఏ అభినందించింది. హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ కూడా దిలీప్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, బీసీసీఐ ఈ ముగ్గురి నియామకాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, Rahul dravid, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు