హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రోకబడ్డీ సీజన్ 7 ప్రారంభమైంది. సీజన్ ప్రారంభ మ్యాచ్ తెలుగు టెైటాన్స్, యు ముంబా జట్ల మధ్య జరిగింది. అయితే సొంత గడ్డపై తొలిమ్యాచ్ లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశ పరిచింంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా యు ముంబాతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 31-25 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ ఏకంగా పది రైడింగ్ పాయింట్లు సాధించగా, అదే జట్టుకు చెందిన డిఫెండర్స్ రోహిత్ బలియాన్, సందీప్ నర్వాల్, ఫజెల్ చెరో నాలుగు పాయింట్లు సాధించారు. అలాగే సురేందర్ సింగ్, అతుల్ సైతం చెరో రెండు పాయింట్లు సాధించి తెలుగు టైటాన్స్ ను మట్టి కరిపించారు.
అటు తెలుగు టైటాన్స్ జట్టులో రజనీష్ 8 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయి 5, ఫర్హాద్ 3 పాయింట్లతో రాణించినప్పటికీ యూ ముంబాను నిలువరించలేక పోయింది. దీంతో సొంతగడ్డపై తెలుగు టైటన్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
Abhi-'shaking' the Titans' defence with a Super 10 on the #WorldsToughestDay! 💪
Keep watching Star Sports for all the LIVE action from the #VIVOProKabaddi Season 7! #HYDvMUM #IsseToughKuchNahi pic.twitter.com/kPXnAzruEg
— ProKabaddi (@ProKabaddi) July 20, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ProKabaddi, Sports