పసుపు తాడునే గొంతుకు బిగించి.. గర్భిణీని చంపేసిన భర్త..

నాలుగు నెలల గర్భిణిగా ఉన్న నంగాలమ్మపై అనుమానం పెంచుకొని నిలదీశాడు. గొడవ పెద్దదవడంతో పసుపుతాడుతో గొంతు బిగించి చంపేశాడు.

news18-telugu
Updated: July 30, 2020, 11:35 AM IST
పసుపు తాడునే గొంతుకు బిగించి.. గర్భిణీని చంపేసిన భర్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కట్టుకున్న భార్యను దారుణంగా చంపేశాడో భర్త. తాళినే గొంతుకు బిగించి.. ఊపిరాడకుండా చేసి.. హత్యచేశాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా కిరాతకంగా ప్రాణాలు తీశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తికి రెండు వివాహలు జరిగాయి. మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురిచేయడంతో మొదటి భార్య అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత రెండేళ్ల క్రితం గణపరానికి నంగాలమ్మను పెళ్లి చేసుకున్నాడు. అబ్బులు, నంగాలమ్మ దంపతులకు 9 నెలల బాలుడు ఉన్నాడు. మొదటి భార్య వెళ్లిపోయినప్పటికీ అబ్బులు ప్రవర్తనలో మార్పు రాలేదు. మద్యం తాగి రెండో భార్యను కూడా నిత్యం వేధించేవాడు.

అనుమానంతో తరచూ చేయి చేయిచేసుకోవడంతో నంగాలమ్మ కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఐ. పంగిడిలో ఉన్న తన సోదరికి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. అబ్బుటు ఇటీవలే ఓ చేపల చెరువులో పనికి కుదిరాడు. తాను మారానని, భార్యను మంచిగా చూసుకుంటానని అత్తింటి వారికి చెప్పాడు. త్వరగా ఇంటికి రావాలని భార్యకు తమ బంధువులతో రాయబారం పంపించాడు. అతడి మాటలు నమ్మి జూలై 17న నంగాలమ్మ, తన కుమారుడితో కలిసి భర్త వద్దకు వెళ్లింది. కానీ ఆ మరుసటి రోజే మళ్లీ నరకం చూపించాడు అబ్బులు. మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న నంగాలమ్మపై అనుమానం పెంచుకొని నిలదీశాడు. గొడవ పెద్దదవడంతో పసుపుతాడుతో గొంతు బిగించి చంపేశాడు.

చుట్టు పక్కల వారికి విషయం తెలిసి, అబ్బులును ఆరా తీశారు. ఐతే తన భార్య నిద్రపోతోందని చెప్పి, కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అసలు మ్యాటర్ వారికి తెలియడంతో.. అబ్బులు కూడా ఆత్మహత్యా యత్నం చేశాడు. బీరు సీసాతో గొంతులో పొడుచుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్వల్ప గాయం కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తమ్ముడి ఇంటికి వెళ్లిపోయాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం గణపవరం పోలీసులు అబ్బులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 30, 2020, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading