రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ అలాగే భారత దేశం నుంచి మొదటి మహిళా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ దేశీయ ఫుట్ బాల్ రంగం అవకాశాలపై తన అభిప్రాయాలను ఇండియాటుడే ఇంటర్వ్యూలో వెల్లిబుచ్చారు. ఇండియా సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆవిర్భావంతో కొత్త ఫుట్‌బాల్ హీరోలు క్రీడారంగంలో పరిచయం అయ్యారని, నీతా అంబానీ అన్నారు. అలాగే ఎటికె, మోహన్ బాగన్ విలీనం, ఎఫ్‌సి గోవాకు ఎఎఫ్‌సి ఛాంపియన్స్ లీగ్‌కు అర్హత, మాంచెస్టర్ సిటీ భారతదేశానికి రావడం గురించి కూడా ఆమె మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో, 2026 ఫిఫా ప్రపంచ కప్‌కు భారత్ అర్హత సాధించాలని, ఒలింపిక్స్ యూత్ ఒలింపిక్స్ కోసం భారతదేశం క్వాలిఫై అయ్యేలా చూడటమే లక్ష్యమని నీతా అంబానీ అన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.