మన దేశానికి స్వతంత్రం వచ్చాక ఒలింపిక్స్‌కు (Olympics) వెళ్లి వ్యక్తిగత విభాగంలో పతకం సంపాదించిన మొదటి అథ్లెట్ ఖాష్బా దాదాసాహెబ్ జాదవ్. 1952 హెల్సింకీలో జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో (Wrestling) కాంస్య పతకం (Bronze) సాధించాడు. అంతకు ముందు నోర్మాన్ పిచార్డ్ అథ్లెటిక్స్‌లో రజతాలు సాధించినా ఆయన ఆంగ్లో ఇండియన్. హాకీ జట్టు స్వర్ణ పతకాలు సాధించినా అది టీమ్ ఈవెంట్. కానీ తొలి సారి భారతీయుడు ఒలింపిక్ వ్యక్తిగత పతకం సాధించింది మాత్రం రెజ్లింగ్‌లోనే. అప్పటి నుంచే ఇండియాలో రెజ్లింగ్‌పై మక్కువ పెరిగింది. హర్యాణా, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లోరెజ్లింగ్పై పట్టు సాధించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో మహవీర్ సింగ్ ఫొగట్ ఒకరు. జాతీయ స్థాయి చాంపియన్ అయిన ఫొగట్.. తన కూతుర్లను కూడా రెజ్లింగ్‌లో నిష్ణాతులను చేశారు. కానీ ఒలింపిక్స్‌కు మాత్రం వారు చేరుకోలేక పోయారు. ఇటీవల కాలంలో హత్య కేసులో ఇరుక్కున్న సుశీల్ కుమార్ 1952లో దాదాసాహెబ్ జాదవ్ తర్వాత రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కాంస్య పతకం సాధించడమే కాకుండా ఆ తర్వాత నాలుగేళ్లకు 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. ఆ ఏడాది యోగేశ్వర్ దత్ కూడా లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. భారత ఒలింపిక్ టీమ్ 2016 రియో ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్య దక్కగా.. ఆ కాంస్య పతకాన్ని రెజ్లర్ సాక్షి మాలిక్ దక్కించకున్నది.
ఒకసారి ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ల ఫామ్ చూస్తే 2008 నుంచి వరుసగా ఒక పతకాన్ని ఇండియాకు సాధించి పెట్టారు. సుశీల్ ప్రారంభించిన ఫామ్‌ను రియోలో సాక్షి కొనసాగించిది. ఇక సారి టోక్యో ఒలింపిక్స్‌లో ఎవరు రెజ్లింగ్ విభాగంలో భారత గౌరవాన్ని నిలబెడటారనేది ప్రశ్నగా మారింది. ఈ సారి ఇండియా నుంచి 8 మంది రెజ్లర్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. అయితే పురుషుల 125 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో క్వాలిఫై అయిన సుమిత్ మాలిక్ డ్రగ్స్ వాడినట్లు తేలడంతో వాడా అతడిపై రెండేళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన వాళ్ల సంఖ్య ఏడుకు పడిపోయింది. అయితే మొదటి నుంచి భారత రెజ్లర్లలో 65 కేజీల ఫ్రీ స్టైల్ క్వాలిఫయిర్ భజరంగ్ పూనియా, మహిళల విభాగంలో అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, వినేష్ ఫోగట్ హాట్ ఫేవరెట్లుగా ఉన్నారు.
ముఖ్యంగా భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మెడల్స్ కొడతారని వెటరన్ రెజ్లర్లు అంచనా వేస్తున్నారు. 2012లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్ దత్ స్వయంగా భజరంగ్ పునియాకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ వేదికలపై భజరంగ్ మంచి ఫలితాలు రాబట్టాడు. ఛత్రాసాల్ స్టేడియం స్టుడెంట్ అయిన పునియా.. ఇటీవల ఆ స్టేడియంకు వచ్చిన మచ్చను చెరిపేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు మీడియా ముందు చెప్పాడు. మరోవైపు ఫొగట్ సిస్టర్స్‌లో ఒకరైన వినేష్ ఈ సారి ఒలింపిక్స్ పతకం సాధించాలనే ధీమాతో ఉన్నది. గతంలో ఎన్నో అంతర్జాతీయ వేదికలపై రాణించినా తన కల ఒలింపిక్స్ అని చెబుతున్నది. ఫొగట్‌తో పాటు ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ కూడా తమ విభాగంలో పతకాల వేటకు సిద్దమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics, Wrestling