MS Dhoni: ధోనీ మనసులో ఏముందో తెలిసేదెలా?

MS Dhoni | ఇక ధోనీని పక్కన పెట్టాలని సెలక్టర్లు భావించే పక్షంలో...వెస్టిండీస్ పర్యటనలో వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం కల్పించడం మంచిదని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ధోనీ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలాగో తెలియక సెలక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.

news18-telugu
Updated: July 18, 2019, 11:30 AM IST
MS Dhoni: ధోనీ మనసులో ఏముందో తెలిసేదెలా?
ఎం ఎస్ ధోనీ (Image : Twitter)
  • Share this:
వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయంతో భారత్ మూడో వరల్డ్ కప్ ఆశలు అడియాశలయ్యాయి. కోహ్లీ సేన లార్డ్స్‌లో క్రికెట్ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుని ముద్దాడుతుందని భారత క్రికెట్ అభిమానులు గత రెండు మాసాలుగా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే సెమీస్‌లో టీమిండియా నిష్క్రమించడంతో సగటు భారత క్రికెట్ అభిమాని నిర్ఘాంతపోయాడు. భారత్ వైఫల్యానికి కారణాలపై ఇప్పుడు ఎవరిస్థాయిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అంతర్గత విభేదాలు నెలకొన్నాయని, అందువల్లే భారత జట్టు ఆశించిన మేరకు రాణించలేకపోయిందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య విభేదాల కారణంగా జట్టులోని సభ్యులందరూ రెండు గ్రూపులుగా విడిపోయారన్నది ఆ పుకార్ల సారాంశం.

అటు న్యూజిలాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ధోనీ నెమ్మదిగా ఆడడమే కొంప ముంచిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పంత్‌లానే ధోనీ కూడా దూకుడుగా ఆడి ఉంటే భారత జట్టు ఫైనల్‌కి చేరి, కప్‌ను సొంతం చేసుకుని ఉండేదని కొందరు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సెమీస్‌లో కీలకమైన సమయంలో ధోనీ 50 పరుగులతో రాణించినా, ఆయనపై విమర్శలు చేయడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు. ధోనీని నెం.7స్థానంలో బ్యాటింగ్‌కు దింపడం ద్వారా కోహ్లీ తప్పు చేశారని, సెమీస్‌లో భారత్ ఓటమికి కోహ్లీ నిర్ణయమే కారణమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ధోనీ రిటైర్మెంట్ తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కొందరు అభిప్రాయపడుతుండగా...మరికొందరు మాత్రం అవసరపడి అలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ ధోనీకి సలహా ఇస్తున్నారు.

ms dhoni news, ms dhoni retirement, dhoni age, team india west indies tour, india team for wi tour, ms dhoni latest news, ధోనీ, మహేంద్ర సింగ్ ధోనీ, ధోనీ రిటైర్మెంట్, టీమిండియా
ధోని (ట్విట్టర్ ఫోటో)


వరల్డ్ కప్ నిరాశ తర్వాత భారత జట్టు వచ్చే నెల 3 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్ టూర్‌కి సన్నద్ధమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు సీనియర్లు వెస్టిండీస్ టూర్‌కు సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ముందుగా ప్రచారం జరిగినా...ఆ తర్వాత కోహ్లీ కూడా వెస్టిండీస్ టూర్‌కు అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే మూడు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించిన భారత జట్టును...ముంబైలో శుక్రవారం సమావేశంకానున్న సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.

ms dhoni news, ms dhoni retirement, ms dhoni age, ms dhoni wife, ms dhoni daughter, bcci news, ind vs wi tour, మహేంద్ర సింగ్ ధోనీ, ధోనీ రిటైర్మెంట్, ధోనీ భార్య
ధోనీ


వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో ధోనీకి చోటు దక్కుతుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ధోనీకి జట్టులో చోటు కల్పించే విషయంలో ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ఉత్కంఠ రేపుతోంది. ధోనీకి జట్టులో చోటు కల్పించినా? కల్పించకపోయినా? సెలక్షన్ కమిటీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.

ms dhoni, dhoni, dhoni captaincy, captain dhoni, team india, indian captain, team india captain dhoni, team india all rounder, all rounder, all rounder hardik pandya, hardik, hardik pandya, vijay shankar, vijay, shankar, tamil nadu, kohli, virat kohli, team india captain kohli, icc, icc cricket, cricket, icc champion trophy, icc world cup, icc world cup 2019, world cup, world cup 2019, icc cricket world cup 2019, virat, dhoni wicket, ms dhoni movie, mahendra singh dhoni, ms dhoni helicopter shot, ms dhoni batting, ms dhoni full movie, ms dhoni retirement, ziva dhoni, ms dhoni sixes,ms dhoni angry,ms dhoni funny,ms dhoni fifty, ms dhoni house, dhoni video, ms dhoni ranchi, ms dhoni biopic, ms dhoni crying, ms dhoni gloves, టీమిండియా, టీమ్ ఇండియా, ధోని, ధోనీ, కెప్టెన్ ధోని, ఇండియా కెప్టెన్, కెప్టెన్, కోహ్లీ, విరాట్ కోహ్లీ, విరాట్, ఎంఎస్ ధోని, ఐసీసీ, ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019, హార్దిక్ పాండ్యా, పాండ్యా, విజయ్ శంకర్, ఆల్ రౌండర్లు, ఆల్ రౌండర్, హార్దిక్, భారత క్రికెట్ జట్టు, క్రికెట్, ధోని సిక్స్‌లు, ధోని విశేషాలు, ధోని సినిమా, కోహ్లీ ధోని, ధోని కోహ్లీ,
మహేంద్ర సింగ్ ధోనీ(ఫైల్ ఫోటో)
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచే వచ్చే వరల్డ్ కప్‌కు భారత జట్టును సన్నద్ధం చేసేలా సెలక్షన్ కమిటీ నిర్ణయాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో జట్టు సభ్యుల మధ్య అభద్రతాభావన్ని కలిగించడం మంచిది కాదన్నారు. ధోనీ మనసులో ఏముందో బీసీసీఐ నిర్వాహకుల్లో ఎవరో ఒకరు మాట్లాడి తెలుసుకోవడం మంచిదని సూచించారు.

ధోనీకి వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే జట్టులో చోటు నిరాకరిస్తే..అది తొందరపాటు నిర్ణయమవుతుందని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇక ధోనీని పక్కన పెట్టాలని సెలక్టర్లు భావించే పక్షంలో...వెస్టిండీస్ పర్యటనలో వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం కల్పించడం మంచిదని సూచిస్తున్నారు. తద్వారా ధోనీకి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.  అయితే ధోనీ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలాగో తెలియక సెలక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
Published by: Janardhan V
First published: July 18, 2019, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading