హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India Prize Money: టీ20 వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు చేరని టీమ్ ఇండియాకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందో తెలుసా?

Team India Prize Money: టీ20 వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు చేరని టీమ్ ఇండియాకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందో తెలుసా?

ఈ ప్ర‌త్యేక‌మైన జ‌ట్టులో ఆరు దేశాల జట్లకు చెందిన ఆటగాళ్లకు స్ధానం దక్కింది. ఎంపికైన వారిలో ఆస్ట్రేలియా, రన్నరప్‌ న్యూజిలాండ్‌, సెమీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, అధేవిదంగా శ్రీలంక,దక్షిణాఫ్రికా చెందిన ఆటగాళ్లు ఉన్నారు.

ఈ ప్ర‌త్యేక‌మైన జ‌ట్టులో ఆరు దేశాల జట్లకు చెందిన ఆటగాళ్లకు స్ధానం దక్కింది. ఎంపికైన వారిలో ఆస్ట్రేలియా, రన్నరప్‌ న్యూజిలాండ్‌, సెమీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, అధేవిదంగా శ్రీలంక,దక్షిణాఫ్రికా చెందిన ఆటగాళ్లు ఉన్నారు.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 స్టేజి నుంచే నిష్క్రమించిన టీమ్ ఇండియాకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ మెగా టోర్నీలో విజేతలతో పాటు రన్నరప్‌కు దక్కేది ఎంత?

  ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్స్ నవంబర్ 14 (ఆదివారం) ఆస్ట్రేలియా (Australia) - న్యూజీలాండ్ (New Zealand) జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్నది. ఈ మెగా టోర్నీలో సాదాసీగాగా ఆడిన ఇరు జట్లు సెమీస్‌లో బలమైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్ చేరాయి. ఈ సారి ఫైనల్స్‌లో ఏ జట్టు గెలిచినా తొలి సారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన రికార్డు సృష్టిస్తుంది. ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. కానీ టీ20 వరల్డ్ కప్ మాత్రం ఇంత వరకు తమ ఖాతాలో వేసుకోలేక పోయింది. ఇక న్యూజీలాండ్ వరుసగా రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినా.. ట్రోఫీ మాత్రం గెలవలేదు. దీంతో ఇరుజట్లు టీ20 వరల్డ్ కప్‌పై కన్నేశాయి. గెలిచిన జట్టుకు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు రూ. 11.89 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 5.54 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఐసీసీ ఈ సారి వరల్డ్ కప్ కోసం మొత్తం 5.6 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ప్రైజ్ మనీ రూపంలో పంచడానికి నిర్ణయించింది. అంటే దాదాపు రూ. 41.63 కోట్ల రూపాయలను విజేతతో పాటు టీ20 కప్‌లో పాల్గొన్న జట్ల మధ్య పంచుతారు.

  టీమ్ ఇండియా సూపర్ 12 స్టేజిలోనే వెనుదిరిగింది. ఐసీసీ నిబంధనల మేరకు సూపర్ స్టేజ్ దశకు వచ్చిన ప్రతీ జట్టుకు రూ. 52 లక్షలు దక్కుతాయి. అలాగే సూపర్ 12 స్టేజిలో గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు రూ. 29.73 లక్షలు లభిస్తాయి. భారత జట్టు సూపర్ 12 స్టేజిలో అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లపై గెలిచింది. దీంతో భారత జట్టుకు మొత్తం రూ. 1.41 కోట్లు ప్రైజ్ మనీ రూపంలో దక్కనున్నాయి. ఐసీసీ టోర్నీ ద్వారా గెలిచిన డబ్బు మొదట బీసీసీఐకి చేరుతుంది. ఆ తర్వాత దాన్ని ఈ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లకు పంచుతారు. అయితే వరల్డ్ కప్ విజేతకు రూ. 11.89 కోట్లు మాత్రమే దక్కనుండగా.. ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు బీసీసీఐ రూ. 20 కోట్ల ప్రైజ్ మనీగా ఇవ్వడం గమనార్హం.

  T20 World Cup: పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్‌కు చికిత్స చేసిన వైద్యుడు భారతీయుడే.. కృతజ్ఞతగా రిజ్వాన్ ఏం చేశాడో తెలుసా?  ఇక చిరకాల క్రీడా ప్రత్యర్థులు ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం తలపడనున్నాయి. సూపర్ 12 దశలో ఈ రెండు జట్లు సాదాసీగాగానే ఆడాయి. కానీ సెమీఫైనల్స్‌లో మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టాయి. గ్రూప్ 1లో టాపర్‌గా నిలిచిన ఇంగ్లాండ్ జట్టును సెమీస్‌లో న్యూజీలాండ్ ధీటుగా ఎదుర్కున్నది. అలాగే గ్రూప్ 2లో టాపర్ అయిన పాకిస్తాన్‌ రెండో సెమీస్‌లో చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించినా ఆసీస్ బ్యాటర్లు స్టొయినిస్, వేడ్ వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ప్రస్తుతం ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ చూస్తే ఆసీస్ జట్టే కాస్త బలంగా కనిపిస్తున్నది. అలాగే వరల్డ్ కప్‌లో గత రికార్డులు కూడా ఆసీస్‌కే అనుకూలంగా ఉన్నాయి.

  Published by:John Kora
  First published:

  Tags: T20 World Cup 2021, Team India

  ఉత్తమ కథలు