హోమ్ /వార్తలు /క్రీడలు /

కేంద్ర మంత్రి Vs ఐవోఏ అధ్యక్షుడు.. ఒలింపిక్స్ సమావేశంలో హాట్ హాట్ చర్చ.. కోప్పడిన మంత్రి.. మధ్యలోనే లెఫ్ట్

కేంద్ర మంత్రి Vs ఐవోఏ అధ్యక్షుడు.. ఒలింపిక్స్ సమావేశంలో హాట్ హాట్ చర్చ.. కోప్పడిన మంత్రి.. మధ్యలోనే లెఫ్ట్

ఒలింపిక్స్ సన్నాహక సమావేశంలో వాడి వేడి చర్చ

ఒలింపిక్స్ సన్నాహక సమావేశంలో వాడి వేడి చర్చ

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)  సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షఉడు నరీందర్ బాత్రా (Narinder Batra) మధ్య మాటల యుద్దం నడిచింది. ఒలింపిక్స్‌కు సంబంధించిన అత్యున్నత సమావేశంలో వీరిద్దరి మధ్య వాడి వేడిగా మాటల యుద్దం కొనసాగింది. అసలు ఏం జరిగిందంటే.. కోవిడ్19 కారణంగా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీని కారణంగా భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి పలు అర్హత టోర్నీలకు హాజరుకాలేకపోయారు. ఇదే విషయం మెయిన్ అజెండాగా సమావేశం జరిగింది. గత నెలలో భారత అథ్లెట్లు పాల్గొనాల్సిన వరల్డ్ రిలేలు, ఇండియా-బ్రిటన్ మధ్య ప్రో లీగ్ హాకీ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అంతే కాకుండా మలేషియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలు కూడా రద్దు కావడంతో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ టోర్నీలు వాయిదా పడటం వల్ల చాలా మంది భారత ఆటగాళ్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది. ఇదే పాయింట్‌ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశంలో లేవనెత్తారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఈ విషయంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద ఒత్తిడి తేవాల్సిందని వ్యాఖ్యానించారు. 'క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అర్హత టోర్నీల విషయంలో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సరైన సమాచారాన్ని ఇవ్వాల్సింది' అని రిజిజు అన్నారు.

కిరణ్ రిజిజు వ్యాఖ్యలను ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఖండించారు. మేము అన్ని క్రీడా సమాఖ్యలతో టచ్ లో ఉన్నామని. వారికి సరైన సమాచారం అందిస్తున్నామని అన్నారు. దీంతో మంత్రి కిరణ్ రిజిజు అసహనానికి గురయ్యారు. తన పొజిషన్ ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. భారత అథ్లెట్లు ఎందుకు అర్హత పోటీల్లో పాల్గొన లేక పోయారు. మ్యాచ్‌లు వాయిదా పడటం వల్ల జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరని రిజిజు ప్రశ్నించారు. దీంతో నరీందర్ బాత్రా వెంటనే మంత్రికి క్షమాపణలు చెప్పారు. కానీ అప్పటికే కోపంతో ఉన్న రిజిజూ సమావేశం మధ్యలోనే నిష్క్రమించారు. ఇతర అధికారులు, ఐవోఏ మంత్రిని సముదాయించాలని ప్రయత్నించినా ఆయన తిరిగి సమావేశానికి హాజరు కాలేదు.


ఒలింపిక్స్, భారత అథ్లెట్ల సమస్యలకు సంబంధించిన విషయాలు చర్చించడానికి ఏర్పాటు చేసిన ఈ అత్యున్నత సమావేశంలో రిజిజు, బాత్రాలో పాటు క్రీడాశాఖ కార్యదర్శి రవి మిట్టల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సందీప్ ప్రధాన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అదిల్ సుమారివల్లా, క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ఎస్ సింగ్, విదేశాంగ శాఖ ప్రతినిధి గగన్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు