Home /News /sports /

HOROSCOPE TODAY DECEMBER 30 ZODIAC SIGN WISE RASI PHALALU IN TELUGU MKS

Horoscope Today: డిసెంబర్ 30 : ఇవాళ ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు..

నేటి దిన ఫలాలు

నేటి దిన ఫలాలు

ఇవాళ (డిసెంబర్ 30, 2021, గురువారం) కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెబితే చిక్కులు తప్పవు. మిథునరాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. వృషభ రాశి వారు ఇవాళ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. కన్యారాశి వారి తల్లి ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. రాశుల వారీగా ఇవాళ్టి దినఫలాలు ఇలా ఉన్నాయి..

ఇంకా చదవండి ...
  మేషం (అళ్విని, భరణి, కృత్తిక 1)
  శ్రేయోభిలాషులు మీకు మంచి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అనుకూలమైన సమయం. ప్రేమ సంబంధంలో పరస్పర విశ్వాసం పెరుగుతుంది. గందరగోళ వైవాహిక జీవితం కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యాలను సాధించే దిశగా చురుకుగా కదులుతారు.

  వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగళిర 1, 2)
  పని చేసే చోట ఒత్తిడి ఎదుర్కొంటారు. కానీ ప్రతిదీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇవాళ అతి విశ్వాసాన్ని నివారించండి. ప్రత్యర్థులు, శ్రేయోభిలాషుల ముందు మీ గురించి చెడుగా మాట్లాడవచ్చు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

  మిథునం (మృగశిర 3, శీ ఆర్ష, పునర్వసు 123)
  వ్యాపార భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. కార్యాలయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉన్నాయి. మీ పిల్లల కెరీర్‌కు సంబంధించి మీ ఆందోళనలు తీరుతాయి. ఈరోజు, మీరు మీ స్నేహితులతో సరదాగా ఉల్లాసమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఊహాత్మక ఆలోచనలు మిమ్మల్ని వెలుగులో ఉంచుతాయి.

  కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశ్లేష)
  ముఖ్యమైన వ్యక్తిగత పనుల విషయంలో ఇతరులను నమ్మొద్దు. విద్యార్థులు చదువుల గురించి చాలా ఆందోళన చెందుతారు. ఆస్తి లావాదేవీలకు సంబంధించి వివాదాలు ఉండవచ్చు. ఎవరికీ డబ్బుకు సంబంధించిన వాగ్దానాలు చేయవద్దు. పని మీద దృష్టి పెట్టలేకపోతే, కొన్ని కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి ప్రయత్నించాలి.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  వ్యక్తిగత జీవితంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగం మారాలనుకుంటే ఈ రోజు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో పెద్ద ఆర్డర్‌లు ఉండకపోవచ్చు.

  కన్య (ఉత్తర 2, 3 4 హస్త, చిత్త 1 2)
  అపరిచితులతో మీ వ్యక్తిగత జీవితం గురించి చర్చించకండి. ఇవాళ మీరు మాట్లాడే ప్రతి మాట మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఇవాళ నోటిని అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి ఉత్సాహంతో ఉంటారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ కింది అధికారులు మీ పనిలో ఆటంకాలు కలిగించవచ్చు.

  తుల (చిత్త 3, 4ఉ స్వాతి, విశాఖ1, 23)
  ప్రొఫెనల్ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇవాళ ఆఫీసులో ప్రశంసలు వస్తాయి. రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ఇవాళ పెద్ద విజయాన్ని సాధించే అవకాశముంది. చిన్న వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో తగినంత సమయం గడుపుతారు. ఆథ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు.

  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్వేష్ట)
  మీ శత్రువులను తక్కువ అంచనా వేసే తప్పు చేయవద్దు. విద్యార్థులు తమ కెరీర్ ఎంపికల గురించి గందరగోళానికి గురవుతారు. కాబట్టి, ఈరోజు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబం ఏదో ఒక విషయంలో మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఒకరి ప్రవర్తన మీ మనోభావాలను దెబ్బతీయవచ్చు.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఈరోజు మీ ఇంటికి అతిథులు రావచ్చు. ఉద్యోగంలో మార్పులకు అనుకూలమైన రోజు. కొత్త పాలసీలలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. వైవాహిక జీవితం ప్రేమగా నిండి ఉంటుంది. హోటల్, రెస్టారెంట్ లాంటి టూరిజం సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఆదాయం వేగంగా పెరుగుతుంది.

  మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ట 1)
  కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లే సూచనలున్నాయి. కొత్త భాగస్వాములు మీ వ్యాపారంలో చేరవచ్చు. సహోద్యోగులతో పాటు ప్రత్యర్థులపై కూడా మీరు ఆధిపత్యం చెలాయిస్తారు. గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒత్తిడి తొలగిపోతుంది. వృత్తిపరమైన, సామాజిక పరిచయాల్లో మీ పరపతి పెరుగుతుంది.

  కుంభం (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩)
  ఆథ్యాత్మిక, తాత్విక విషయాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు ప్రభుత్వ అధికారులకు ఉపశమనం కలిగిస్తుంది. మీ సలహాలు, సూచనలు ఇతరులకు ఎంతో మేలు చేస్తాయి. మీ పిల్లలతో కలిసి సరదాగా ఉల్లాసమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు మీ మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కానీ విజయం సాధించలేరు.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  మతపరమైన విషయాల్లో నిర్లిప్తత చూపుతారు. ఈరోజు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది, ఒంట్లో వణుకు, బెరుకు, నొప్పి ఎదుర్కొంటారు. వైవాహిక బంధంలో సాన్నిహిత్యం తగ్గే అవకాశముంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మోసకారి వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దు.
  Published by:Madhu Kota
  First published:

  Tags: Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు