Hockey World Cup 2023 : హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) 2023కి రంగం సిద్దమైంది. భారత్ (India) వేదికగా జనవరి 13 నుంచి 29 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి రోజు ఏకంగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్ కూడా తన తొలిపోరును శుక్రవారం ఆడనుంది. స్పెయిన్ తో జరిగే ఈ పోరులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. గ్రూప్ ‘డి’ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ప్రపంచకప్ లో భారత్ పాల్గొనడం ఇది 15వ సారి. ప్రతి ప్రపంచకప్ లోనూ భారత్ ఆడటం విశేషం.
ప్రతి ప్రపంచకప్ లో ఆడుతున్నా భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే చాంపియన్ గా నిలిచింది. 1975లో అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా చాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి భారత ఆటతీరు గాడి తప్పింది. 1978 నుంచి 2014 వరకు ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేకపోయింది. 2018లో మాత్రం ఐదో స్థానంలో నిలిచింది. 1971లో తొలిసారిగా జరిగిన ప్రపంచకప్ లో మూడో స్థానంలో నిలిచింది. అయితే 48 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఈసారి చాంపియన్ గా నిలవాలనే పట్టుదల మీద భారత్ ఉంది.
India's memorable FIH Hockey World Cup Triumph!
India defeated Pakistan 2-1 in the final of the 1975 FIH Hockey World Cup to win their only title! Follow all the updates from the #HWC2023 on https://t.co/3Tmw1e4ga5.@TheHockeyIndia#HockeyEquals #HockeyInvites #India pic.twitter.com/JprefNTXoF — International Hockey Federation (@FIH_Hockey) January 11, 2023
ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులోనూ ఉన్న నాలుగు జట్లు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశ పూర్తి అయ్యాక ప్రతి గ్రూప్ లోనూ టాప్ 2లో నిలిచిన మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. భారత్ గ్రూప్ ‘డి’లో ఉంది. ఇందులో భారత్ తో పాటు స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. బెల్జియం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
భారత షెడ్యూల్
ఎప్పుడు | ఎవరితో | సమయం |
జనవరి 13 | స్పెయిన్ | రాత్రి 7 గంటలకు |
జనవరి 15 | ఇంగ్లండ్ | రాత్రి 7 గంటలకు |
జనవరి 19 | వేల్స్ | రాత్రి 7 గంటలకు |
టీమిండియా జట్టు : అభిషేక్, సురేందర్ కుమార్, మన్ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, జర్మన్ ప్రీత్ సింగ్, మన్ దీప్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ (కెప్టెన్), లలిత్ ఉపాధ్యాయ్, పఠాక్, నీలమ్ సంజీప్, పీఆర్ శ్రీజేశ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వరుణ్ కుమార్, అక్షదీప్ సింగ్, అమిత్ రోహిదాస్ (వైస్ కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్, సుఖ్జీత్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, Hockey World Cup 2023, Team India