హోమ్ /వార్తలు /క్రీడలు /

గ్రేట్ అథ్లెట్.. హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత..

గ్రేట్ అథ్లెట్.. హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత..

బల్బీర్ సింగ్ (Photo : twitter)

బల్బీర్ సింగ్ (Photo : twitter)

మూడు సార్లు ఒలింపిక్ మెడల్స్ విజేత, ఇండియా హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్(95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో రెండు వారాలుగా మొహాలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

  మూడు సార్లు ఒలింపిక్ మెడల్స్ విజేత, ఇండియా హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్(95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో రెండు వారాలుగా మొహాలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నెల 8న బల్బీర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, వారం నుంచి సెమీ కోమా స్థితిలో వెంటిలేటర్‌పై ఉండగా.. ఈరోజు ఉదయం 6.30 గంటలకు ఆరోగ్యం విషమించి చనిపోయారని వైద్యులు తెలిపారు. ఒలింపిక్స్‌లో బల్బీర్ సింగ్‌ది ప్రత్యేక చరిత్ర.. దిగ్గజాలకే దిగ్గజం.. ఏకంగా మూడు సార్లు భారత్‌కు గోల్డ్ మెడల్స్ అందించిన ఆటగాడు. ఆధునిక ఒలింపిక్ చరిత్రలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసిన 16 మంది దిగ్గజాలలో ఒకరైన బల్బీర్ సింగ్ ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ అథ్లెట్‌. ఒలింపిక్స్ హాకీ ఫైనల్స్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత గోల్స్‌లో బల్బీర్ సింగ్ ప్రపంచ రికార్డు ఇప్పటికీ అజేయంగా ఉంది.

  1952 హెల్సింకి గేమ్స్‌లో నెదర్లాండ్స్‌‌తో ఆడిన మ్యాచ్‌లో ఐదు గోల్స్ చేశారు. ఆ రికార్డును ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. లండన్ (1948), హెల్సింకి (1952), మెల్బోర్న్ (1956) ఒలింపిక్స్ లో బల్బీర్ ఆధ్వర్యంలో ఇండియాకు గోల్డ్ మెడల్స్ దక్కాయి. బల్బీర్.. లండన్ గేమ్స్‌లో సీనియర్ ప్లేయర్‌గా, 1952 లో వైస్ కెప్టెన్‌గా, 1956లో కెప్టెన్‌గా ఉన్నారు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Olympics

  ఉత్తమ కథలు