Home /News /sports /

HIMACHAL PRADESH CREATES HISTORY AND BEAT TAMIL NADU TO CLINCH THEIR MAIDEN VIJAY HAZARE TROPHY TITLE SRD

Vijay Hazare Trophyలో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర.. దినేశ్ కార్తీక్ సూపర్ సెంచరీ వృధా..

Vijay Hazare Trophy Winner (BCCI)

Vijay Hazare Trophy Winner (BCCI)

Vijay Hazare Trophy : లక్ష్య ఛేదనలో హిమాచల్‌ ప్రదేశ్‌ 47.3 ఓవర్లలో 299/4తో ఉన్న సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిపివేయబడింది. దీంతో విజేడీ (VJD) పద్ధతిలో అంపైర్లు హిమాచల్‌ ప్రదేశ్‌ను విజేతగా ప్రకటించారు.

    దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. తొలి సారి Vijay Hazare Trophy 2021 టైటిల్ ని హిమాచల్‌ ప్రదేశ్‌ కైవసం చేసుకుంది. . జైపూర్ వేదికగా ఆదివారం తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా హిమాచల్ టీమ్ టైటిల్ ఎగరేసుకుపోయింది. మాజీ ఛాంపియన్ తమిళనాడు (Tamil Nadu)తో జరిగిన ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) 11 పరుగుల తేడాతో గెలుపొంది. లక్ష్య ఛేదనలో హిమాచల్‌ ప్రదేశ్‌ 47.3 ఓవర్లలో 299/4తో ఉన్న సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిపివేయబడింది. దీంతో విజేడీ (VJD) పద్ధతిలో అంపైర్లు హిమాచల్‌ ప్రదేశ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో విజయ్‌ హజారే ట్రోఫీని హిమాచల్‌ ప్రదేశ్‌ తొలిసారి ఖాతాలో వేసుకుంది.

    తమిళనాడు బ్యాటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) మెరుపు సెంచరీ వృధా అయింది. సెంచరీతో జట్టును ఆదుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ వికెట్ కీపర్ శుభమ్ అరోరా (Shubham Arora)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన హిమాచల్‌ ప్రదేశ్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది.


    ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్లు అపరాజిత్‌ (2), జగదీశన్‌ (9), సాయి కిషోర్‌ (18), ఎం అశ్విన్‌(7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఫోర్లు, సిక్సులతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. డీకేకి ఇంద్రజిత్‌ (80) అండగా నిలిచాడు. షారుఖ్‌ ఖాన్‌ 21 బంతుల్లోనే 42 పరుగులు చేయడంతో తమిళనాడు స్కోర్ 300 దాటింది. 49.4 ఓవర్లలో తమిళనాడు 314 పరుగులకు ఆలౌట్ అయింది. హిమాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లలో పంకజ్‌ జైస్వాల్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


    ఆ తర్వాత 315 పరుగుల ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ ఓపెనర్ శుభమ్ అరోరా (136 నాటౌట్: 131 బంతుల్లో 13x4, 1x6) అజేయ శతకం నమోదు చేయగా.. అమిత్ కుమార్ (74: 79 బంతుల్లో 6x4), కెప్టెన్ రిషి ధావన్ (42 నాటౌట్: 23 బంతుల్లో 5x4, 1x6) సమయోచితంగా అతనికి సపోర్ట్ ఇచ్చారు. అయితే.. మ్యాచ్‌ మరికాసేపట్లో ముగుస్తుందన్న దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ని అంపైర్లు నిలిపివేశారు.

    దీంతో.. వీజేడీ పద్ధతి తెరపైకిరాగా.. గెలుపునకి హిమాచల్ ప్రదేశ్ 47.3 ఓవర్లు ముగిసే సమయానికి 288 పరుగులు చేయాల్సి ఉండేది. కానీ.. ఆ జట్టు అప్పటికే 299 పరుగులు చేసి ఉండటంతో.. 11 పరుగుల తేడాతో హిమాచల్ టీమ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో.. తమిళనాడు ఆటగాళ్లు మైదానంలోనే నిరాశ వ్యక్తం చేయగా.. హిమాచల్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Dinesh Karthik, Himachal Pradesh, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు