Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: July 29, 2018, 6:11 PM IST
హిమదాస్
హిమదాస్... అంతర్జాతీయ టోర్నమెంట్లో రన్నింగ్లోనూ భారతదేశానికి తొలిసారి స్వర్ణపతాకం సాధించి పెట్టిన అథ్లెట్. ఫిన్లాండ్ వేదికగా జరిగిన 400 మీటర్ల రేసులో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణపతకం సాధించిన ఈ అస్సాం సంచలనాన్ని తీర్చిదద్దిన కోచ్ నిపున్ దాస్ పేరు కూడా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే నివున్ దాస్ ప్రస్తుతం అనుకోని చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
నివున్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ 20 ఏళ్ల అథ్లెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుహవాటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో నిపున్ దాస్ దగ్గర శిక్షణ పొందిన ఈ అథ్లెట్... జూన్ 26 నుంచి 29 మధ్య జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే ఈ అర్హత పరీక్షలకు ముందే జూన్ 22న ఆమె కోచ్ నిపున్పై స్థానిక పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
తాజాగా ఈ ఆరోపణలపై స్పందించిన నిపున్...

ఆ అమ్మాయి 100 మీ. 200 మీ. రేసు కోసం నా దగ్గర శిక్షణ తీసుకుంటోంది. అయితే తనను అస్సాం జట్టులో చేర్పించాలని ఎప్పుడూ నా వెంట పడేది. అయితే ఆమె కంటే ప్రతిభావంతులు చాలా మంది ఇంకా అవకాశం ఎదురుచూస్తున్నారు. అందుకే ఎంత వేడుకున్నా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. అందుకే నా మీద కోపం పెంచుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టింది. ఆమె చేసిన ఆరోపణలకి సంబంధించి ఆధారాలు మాత్రం ఆమె దగ్గర లేవు.
— నిపున్ దాస్, రన్నింగ్ కోచ్
సదరు యువతి మే18న తనను వేధించినట్టు ఆరోపణలో పేర్కొందని చెప్పిన కోచ్ నిపున్ దాస్...జూన్ 22న కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందంటూ ప్రశ్నించారు. ఇప్పటి దాకా తనను పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పిన నిపున్... తప్పు చేసినట్టు నిరూపణ అయితే ఎటువంటి శిక్షకైనా సిద్దమేనని చెప్పారు.
Published by:
Ramu Chinthakindhi
First published:
July 29, 2018, 6:10 PM IST