వాళ్ళు గది తలుపు కొట్టగానే నా భార్యను అల్మారాలో దాక్కోమన్నా..

Rekulapally Saichand
Updated: July 2, 2020, 3:09 PM IST
వాళ్ళు గది తలుపు కొట్టగానే నా భార్యను అల్మారాలో దాక్కోమన్నా..
Saqlain-Mushtaq
  • Share this:
 

పాక్ మాజీ క్రికెటర్‌ సక్లైన్‌ ముస్తాక్‌ 1999 ప్రపంచ కప్‌ సమయంలో జరిగిన ఓ సరదా సంఘటన అభిమానులతో పంచుకున్నారు.

"ఇంగ్లాండ్‌లో ప్రపంచ కప్ కొనసాగుతున్న సమయంలో క్రికెటర్ల భార్యలను తిరిగి స్వదేశానికి తీసుకురావలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు హఠాత్తుగా  నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నాకు నచ్చలేదు. మాకు పెళ్లయి అప్పటికి కేవలం ఆరు నెలలే మాత్రమే అయింది. ఆమెతో కలిసి సరదాగా గడుపుదాం అనుకునేలోపే బోర్డు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. ఎలాగైనా నా భార్యను నా దగ్గర ఉంచుకోవాలనుకున్నా .. అంతలోనే జట్టు మేనేజర్లు... ఆటగాళ్ళ గదులను తనిఖీ చేస్తున్నారు. నా గది దగ్గరకు వారు రాగానే వెంటనే నా భార్యను అల్మారాలో దాక్కోమన్నా. ఓ మేనజర్ నా గదిలోకి వచ్చి పరిశీలించి వెళ్లిపోయారు. అతను నా గది నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అజార్‌ మహమూద్, మొహమ్మద్‌ యూసఫ్‌లు నా దగ్గరకు వచ్చారు. ఆ గదిలో నా భార్య ఉన్నట్లు వారు కనిపెట్టారు. దీంతో చేసేదేం లేక అసలు విషయాన్ని చెప్పేశానని" ముస్తాక్‌ వివరించాడు.

ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ముస్తాక్‌‌కు భార్యపై ఎంత ప్రేమంటూ పాక్ అభిమానులు సరదా కామెంట్స్
చేస్తున్నారు.
First published: July 2, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading