మహేంద్ర సింగ్ ధోనీకి వార్నింగ్ ఇచ్చిన ప్రీతిజింటా... ఆమెను కిడ్నాప్ చేస్తానంటూ...

కెప్టెన్ కూల్‌కు నేను అభిమానిని... కానీ ఇప్పుడు నా ఫోకస్ అంతా జీవా మీదే... ధోనీ జాగ్రత్తగా ఉండకపోతే ఆమెను కిడ్నాప్ చేసేస్తానంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ప్రీతిజింటా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 8:07 PM IST
మహేంద్ర సింగ్ ధోనీకి వార్నింగ్ ఇచ్చిన ప్రీతిజింటా... ఆమెను కిడ్నాప్ చేస్తానంటూ...
మహేంద్ర సింగ్ ధోనీతో ప్రీతిజింటా (Photo: twitter)
  • Share this:
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని హెచ్చరిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ-యజమాని, హీరోయిన్ ప్రతీజింటా. పంజాబ్ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా... గెలిచిన వెంటనే సంతోషంతో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి, బ్యాట్స్‌మెన్‌నూ, బౌలర్‌ను హత్తుకుంటూ తెగ సందడి చేసే ప్రీతిజింటాకు ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. 6 మ్యాచుల్లో గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 12 పాయింట్లు సాధించినప్పటికీ... రన్‌రేట్ మరీ తక్కువగా ఉండడంతో ఆరో స్థానానికి పరిమితమైంది. గ్రూప్ దశలో జరిగిన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించినా... ఫ్లేఆఫ్ చేరేందుకు ఆ విజయం సరిపోలేదు. అయితే నాలుగు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయిన తర్వాత చెన్నైపై విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది ప్రీతి జింటా. చెన్నై కెప్టెన్ ధోనీతో మాట్లాడుతున్న ఫోటో పోస్ట్ చేసిన ప్రీతిజింటా... తాను ధోనీకి అభిమానినంటూ కామెంట్ చేసింది.
‘కెప్టెన్ కూల్‌కి ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో నేను కూడా ఒకదాన్ని. అయితే ఇప్పుడు నా దృష్టి మొత్తం ధోనీ కూతురు జీవాపై మళ్లింది. నేను ఇప్పుడే చెబుతున్నా... ధోనీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను జీవాను కిడ్నాప్ చేసేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోటోకు కాప్షన్ ఇవ్వండి’ అంటూ ధోనీతో షేక్ హ్యాండ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది ప్రీతిజింటా.


Published by: Ramu Chinthakindhi
First published: May 7, 2019, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading