Home /News /sports /

HERE HOW LOOKS WORLD TEST CHAMPIONSHIP POINTS TABLE STANDS AFTER SECOND TEST BETWEEN INDIA VS SRI LANKA SRD

WTC Points Table: శ్రీలంకపై సూపర్ విక్టరీ టీమిండియాకు కలిసొచ్చింది.. WTCలో రెండో సారి ఫైనల్ ఆడే ఛాన్స్.. ఎలాగంటే..

Team India ( PC : BCCI)

Team India ( PC : BCCI)

WTC Points Table: రెండున్నర రోజుల్లో గులాబీ టెస్ట్ ముగియడం విశేషం. ఇక సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం. ఈ విక్టరీతో టీమిండియాకు మరో ప్రయోజనం చేకూరింది.

    గులాబీ టెస్టులో టీమిండియా దుమ్మురేపింది. సొంతగడ్డపై రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) మరో భారీ విజయాన్నందుకుంది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన గులాబీ టెస్ట్‌లో సమష్టిగా రాణించిన భారత్ టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే కుప్పకూలింది. లంక్ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(174 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. రెండున్నర రోజుల్లో గులాబీ టెస్ట్ ముగియడం విశేషం. ఇక సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం.

    ఈ విక్టరీతో టీమిండియాకు మరో ప్రయోజనం చేకూరింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ (WTC Points Table) లో నాలుగో స్థానానికి ఎగబాకింది రోహిత్ సేన.ఈ మ్యాచ్‌కు ముందు భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంకపై 2-0తో క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా గెలుపు శాతం 58.33కి చేరుకుంది. అదే సమయంలో శ్రీలంక జట్టు రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో, WTC పాయింట్ల పట్టికలో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది లంక టీమ్. శ్రీలంక విజయ శాతం 50కి తగ్గింది.

    WTC పాయింట్ల టేబుల్


    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా గెలుపు శాతం 77.77. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ విజయ శాతం 66.66గా ఉంది. ఇక, దక్షిణాఫ్రికా విజయ శాతం 60. భారత్ ఇప్పటి వరకు మొత్తం నాలుగు సిరీస్ ల్లో 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆరింట్లో విజయం సాధించింది. అయితే మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మిగిలిన 2 టెస్టులు డ్రా అయ్యాయి.

    ఇది కూడా చదవండి :  కోహ్లీ పేరు మీద ఉన్న ఈ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యమే..! మరో రెండు రికార్డులు కూడా..

    రెండో ఫైనల్ ఆడే ఛాన్స్

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఫైనల్ 2023లో జరగనుంది. దీనికి ముందు భారత్ మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్‌ ఇంగ్లండ్‌లో ఒక టెస్టు, బంగ్లాదేశ్‌లో 2, ఆస్ట్రేలియాతో స్వదేశంలో 4 టెస్టులు ఆడనుంది. ఇదే విధంగా రాణిస్తే.. ఈ మ్యాచుల్లో గెలుపు సాధించడం అంత కష్టమేమీ కాదు. ఇ భారత్ ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవచ్చు. 2021లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి ఫైనల్ ఆడింది. అయితే న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    ఆస్ట్రేలియా గెలిస్తే భారత్ ముందుకు..

    ఇక, కరాచీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంటుంది. అప్పుడు పాక్ నాలుగో స్థానానికి పడిపోయే ఛాన్సుంది. ఇంకా ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో టాప్ స్ధానంలో కొనసాగుతోంది. ఇక, కరాచీ టెస్టుల్లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs srilanka, Rohit sharma, Team India, WTC Final

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు