Home /News /sports /

HERE HOW AUSTRALIA VICE CAPTAIN STEVE SMITH ESCAPED AFTER GETS STUCK IN ELEVATOR WATCH VIRAL VIDEO SRD

Viral Video : అయ్యో.. పాపం స్మిత్..! స్టార్ క్రికెటర్ కు లిఫ్ట్ లో 55 నిమిషాల పాటు నరకం..

Steve Smith (PC : Twitter)

Steve Smith (PC : Twitter)

Viral Video : ప్రాక్టీస్ ముగించుకుని హోటల్ రూమ్ కి వచ్చారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఆ తర్వాత జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. కానీ.. పాపం.. స్మిత్ కు అనుకోని పరిస్థితి ఎదురైంది.

    ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ (Steve Smith)కు వింత అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 9 తేదీ వరకు జరగనుంది.యాషెస్ సిరీస్‌ (Ashes Series 2021-22) ను 3-0 తేడాతో గెలుచుకున్న ఆస్ట్రేలియా జ‌ట్టు సిడ్నీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. యాషెస్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. మ‌రోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం వ‌రుస వైఫ‌ల్యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంది. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనైనా పుంజుకోని వైట్ వాష్ ప్రమాదం నుంచి త‌ప్పించుకోవాల‌ని భావిస్తోంది.

    ఈ నేపథ్యంలో గట్టిగా ప్రాక్టీస్ ముగించుకుని హోటల్ రూమ్ కి వచ్చారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఆ తర్వాత జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యలోనే ఆగిపోయింది.

    దీంతో.. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 55 నిముషాల‌పాటు లిఫ్ట్‌లోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది. దీంతో లిఫ్ట్‌లో స్మిత్ ల‌బోదిబోమ‌న్నాడు. అప్ప‌టికీ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు మార్నస్‌ లబుషేన్‌.. స్మిత్‌ను బ‌య‌టికి తీసే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. చివ‌రికి లిఫ్ట్ టెక్నీషియ‌న్ వ‌చ్చి ఆ లిఫ్ట్‌ను బాగు చేయ‌డంతో స్మిత్ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. త‌న‌ను ర‌క్షించిన లిఫ్ట్ టెక్నీషియ‌న్‌కు స్మిత్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు.


    త‌నకు ఎదురైన ఈ వింత అనుభ‌వాన్ని స్మిత్ ట్విట్ట‌ర్‌లో వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. లిఫ్ట్ ఎక్కాక తాను దిగాల్సిన ఫ్లోర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ లిఫ్ట్ డోర్లు ఓపెన్ అవ్వ‌లేద‌ని, దీంతో ల‌బుషేన్‌కు స‌మాచారం ఇచ్చాన‌ని చెప్పాడు. అయితే అటు నుంచి ల‌బుషేన్ కూడా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింద‌ని తెలిపాడు.

    ఇది కూడా చదవండి : రాజ్.. పుష్ప రాజ్.. నీ అవ్వ వార్నర్ తగ్గేదే లే.. డేవిడ్ బాయ్ వీడియోకి అల్లు అర్జున్ క్రేజీ రిప్లై..

    ఈ సాయంత్రం చాలా ఎంజాయ్ చేయాల‌ని ప్లాన్ వేసుకున్నాన‌ని, కానీ త‌న టైమ్ అంతా లిఫ్ట్‌లోనే అయిపోయింద‌ని చెప్పుకొచ్చాడు. దీంతో తాను బాగా అల‌సి పోయి, అందులోనే కూర్చుండిపోయిన‌ట్లు చెప్పాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన‌ప్పుడు ఇంత‌క‌న్నా ఏంచేయ‌గ‌ల‌మని, మీకు ఏదైనా తెలిస్తే చెప్ప‌మని ట్విట్ట‌ర్‌ వీడియోలో అభిమానుల‌ను అడిగాడు స్మిత్. దీంతో స్మిత్‌కు కొంత‌మంది డేవిడ్ వార్న‌ర్ మాదిరిగా ఫ‌న్నీ వీడియోలు చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Ashes, Cricket, England vs Australia, Steve smith, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు