ఈయన బౌలింగ్ చేస్తే బ్యాట్స్‌మెన్ల పరిస్థితి ఏంటీ .. ఇంతకీ అతని హైట్ ఎంతో తెలుసా?

మాములుగా ఓ మోస్తారు హైట్ ఉన్న బౌలర్ బౌలింగ్ చేస్తేనే బాట్స్‌మెన్ ఎంత ఇబ్బందపడుతో అందరికి తెలిసిందే. అలాంటిది 7 అడుగుల 6 అంగుళాలు ఎత్తున్న బౌలర్ వేసే బంతులను బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొనగలరు?

మాములుగా ఓ మోస్తారు హైట్ ఉన్న బౌలర్ బౌలింగ్ చేస్తేనే బాట్స్‌మెన్ ఎంత ఇబ్బందపడుతో అందరికి తెలిసిందే. అలాంటిది 7 అడుగుల 6 అంగుళాలు ఎత్తున్న బౌలర్ వేసే బంతులను బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొనగలరు?

 • Share this:
  mudassar gujjar
  మాములుగా ఓ మోస్తారు హైట్ ఉన్న బౌలర్ బౌలింగ్ చేస్తేనే బాట్స్‌మెన్ ఎంత ఇబ్బందపడుతో అందరికి తెలిసిందే. అలాంటిది 7 అడుగుల 6 అంగుళాలు ఎత్తున్న బౌలర్ వేసే బంతులను బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొనగలరు? ఆ సందర్భం ఎదురైతే ఎంటీ పరిస్థితి.. త్వరలోనే అంతర్జాతీయ బాట్స్‌మెన్ ఆ బంతలును ఎదురుకునే సమయం అసన్నమైంది.


   mudassar gujjar
  ఇంతకీ అతను ఎవరా.. అనుకుంటున్నారా! అతనే పాకిస్తాన్‌కు చెందిన ముదస్సర్ గుజ్జర్.. త్వరలోనే అంతర్జాతీయ మ్యాచుల్లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ 21 సంవత్సరాలు వయసున్న ఈ బౌలర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌ల్లో ఫ్యాన్స్ అలరించనున్నాడు. ఈయన ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు.


  తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్‌తో ఆయన ముచ్చటించారు. ఆ సందర్భంలో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడనున్న అతను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సక్సెస్ అయితే జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉంది, ముదస్సర్ గుజ్జర్ షూ సైజు 23.5 ఇంచ్‌లు. అతని తల్లిదండ్రుల ఎత్తు మాత్రం సాధరణమే.


  క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని.. స్కూల్ డేస్ నుంచే ఆటపై ఇష్టం పెరిగిందని తెలిపాడు. కళశాలలో చదివే రోజుల నుంచి పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
  Published by:Rekulapally Saichand
  First published: