హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs NZ: విరాట్ రిటర్న్స్.. ముంబై టెస్టు తుది జట్టులో ఉండేదెవరు? ఊడేదెవరు? రహానే, పుజార, మయాంక్‌లో ఒకరిపై వేటు?

IND vs NZ: విరాట్ రిటర్న్స్.. ముంబై టెస్టు తుది జట్టులో ఉండేదెవరు? ఊడేదెవరు? రహానే, పుజార, మయాంక్‌లో ఒకరిపై వేటు?

కోహ్లీ రిటర్న్స్... తుది జట్టులో వేటు పడేది ఎవరికో? (PC: BCCI)

కోహ్లీ రిటర్న్స్... తుది జట్టులో వేటు పడేది ఎవరికో? (PC: BCCI)

IND vs NZ: కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. అతడి రాకతో తుది జట్టులో నుంచి ఎవరిని తీసేస్తారనే చర్చ తీవ్రమైంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా కోహ్లీ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ముంబైలో భారీ వర్షాలు పడుతున్నందున.. పిచ్‌ను పరిశీలించి టాస్ ముందు తుది జట్టును ప్రకటిస్తామని చెప్పాడు.

ఇంకా చదవండి ...

కాన్పూర్ టెస్టులో విజయం అంచుల వరకు వచ్చి ఆఖర్లో ఒకే ఒక వికెట్ తీయలేక టీమ్ ఇండియా (Team India) మ్యాచ్‌ను డ్రా చేసుకున్నది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం వల్ల భారత జట్టు చాలా నస్టపోయింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో (World Test Championship) భాగంగా ఈ మ్యాచ్ జరగడంతో గెలిస్తే 12 పాయింట్లు పొందాల్సిన చోట.. డ్రాగా ముగించి కేవలం 4 పాయింట్లతో సర్దుకున్నది. మరోవైపు విజయాల శాతం కూడా తగ్గిపోయింది. స్వదేశంలో ఆడే టెస్టులు కూడా ఓడిపోవడమో.. డ్రా చేసుకోవడమో చేస్తే భవిష్యత్‌లో అది తప్పకుండా టీమ్ ఇండియా ఫైనల్ చాన్సులపై భారం పడుతుంది. దీంతో ముంబైలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టులోకి తిరిగి వచ్చాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో బలం పెరిగింది. ఇక ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే తుది జట్టులో నుంచి ఎవరిని తప్పించాలనేదే. గురువారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పడాన్ని కోహ్లీ దాటవేశాడు.

కాన్పూర్ టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal)), అజింక్య రహానే (Ajinkya Rahane), చతేశ్వర్ పుజార (Chateswar Pujara) విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌లో గాయపడిన మయాంక్ ఆ తర్వాత కోలుకొని తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. కానీ అంచనాల మేరక రాణించలేకపోయాడు. ఇక అజింక్య రహానే సరైన ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులు అవుతున్నది. ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టులో చక్కటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత గత 10 టెస్టులుగా విఫలమవుతూనే ఉన్నాడు. ఇక సీనియర్ బ్యాటర్, నయా వాల్‌గా పేరున్న చతేశ్వర్ పుజార భారీ ఇన్నింగ్స్ ఆడక రెండేళ్ల పైనే అవుతున్నది. చివరి సారిగా అతడు 2019 జనవరిలో సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు అతడు అలాంటి ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో ఈ ముగ్గురిలో ఒకరిపై వేటు పడుతుందని తెలుస్తున్నది.

IND vs NZ: ముంబైలో భారీ వర్షాలు.. రెండో టెస్టు జరిగేది అనుమానమే.. ఇన్ డోర్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్


అజింక్య రహానే, చతేశ్వర్ పుజరాలకు జట్టు పూర్తిగా అండగా ఉన్నదని.. బ్యాటింగ్ లైనప్‌లో అలాంటి సీనియర్లు ఉండటం వల్ల బలం చేకూరుతుందని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరులకు చెప్పారు. అంటే వారిద్దరూ జట్టులో ఉండటం ఖాయంగానే కనిపిస్తున్నది. అదే జరిగితే మయాంక్ అగర్వాల్‌పై వేటు పడే అవకాశం ఉన్నది. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్అయ్యర్‌ను తప్పించే సాహసం చేయలేరు. దాంతో మయాంక్ రెండో టెస్టులో చోటు కోల్పోతాడని భావిస్తున్నారు. అతడి స్థానంలో ఎవరు ఓపెనర్‌గా వస్తారనేది ఆసక్తిగా మారింది.

Peng Shuai Effect: పెంగ్ షుయ్ అదృశ్యం ఎఫెక్ట్.. చైనాలో అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు నిలిపివేత


ఇక గురువారం విలేకరులతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి పిచ్‌పై కవర్లు కప్పే ఉంచారు. దీంతో పిచ్‌పై తేమ ప్రభావం ఉంటుంది. అది పేసర్లకు అనుకూలిస్తుంది. ముగ్గురు పేసర్లతో దిగే అవకాశం కూడా ఉన్నదని అన్నాడు. అలా అయితే అశ్విన్ లేదా అక్షర్‌లలో ఒకరిపై వేటు పడే అవకాశం ఉన్నది. ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు తోడు మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చే వీలుంది. అలా కాకుండా ఇద్దరు పేసర్లతో వెళ్లినా.. ఇషాంత్ బదులు సిరాజ్‌కు చోటు దక్కుతుందని సమాచారం. గతంలో టీమ్ ఇండియా ఒక రోజు ముందే టెస్టు జట్టును ప్రకటించేది. కానీ ఈ సారి వర్షం కారణంగా పిచ్‌ను పరిశీలించి.. ఆ తర్వాతే తుది జట్టును ప్రకటిస్తామని విరాట్ కోహ్లీ చెప్పాడు. దీంతో తుది జట్టు ఉత్కంఠతకు టాస్ సమయంలో కాని తెరపడదు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: India vs newzealand, Team India, Test Cricket, Virat kohli

ఉత్తమ కథలు