ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి గండం...జంటనగరాల్లో భారీ వర్షం...

రాగల 24 గంటల్లో జంటనగరాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని సమాచారం అందడంతో, మ్యాచ్ నిర్వాహకుల్లో గుబులు పట్టుకుంది. నేటి సాయంత్రం 7.30 గంటలకు జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.


Updated: May 12, 2019, 9:49 AM IST
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి గండం...జంటనగరాల్లో భారీ వర్షం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హిమాయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన శబ్దాలతో భారీ వర్షాలు పడ్డాయి. నగరంలో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ ఉరుముల శభ్దాలకు నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. పలు చోట్ల చెట్లు కూలడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. అంతే కాదు రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇదిలా ఉంటే నేడు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వరుణుడి గండం పొంచి ఉంది. రాగల 24 గంటల్లో జంటనగరాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని సమాచారం అందడంతో, మ్యాచ్ నిర్వాహకుల్లో గుబులు పట్టుకుంది. నేటి సాయంత్రం 7.30 గంటలకు జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. టిక్కెట్లు కూడా పూర్తిగా అమ్ముడుపోయాయి. దాదాపు 2850 మంది పోలీసులతో మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
First published: May 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading