హోమ్ /వార్తలు /క్రీడలు /

నిధులు లేవంటూ.. బధిర బాలికను వరల్డ్ గేమ్స్‌కు పంపని ఏఐఎస్‌సీడీ.. సాయం కోసం ఎదురు చూపులు

నిధులు లేవంటూ.. బధిర బాలికను వరల్డ్ గేమ్స్‌కు పంపని ఏఐఎస్‌సీడీ.. సాయం కోసం ఎదురు చూపులు

నిధులు లేక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఛాన్స్ మిస్ అయిన బదిర అథ్లెట్ (PC: Twitter)

నిధులు లేక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఛాన్స్ మిస్ అయిన బదిర అథ్లెట్ (PC: Twitter)

అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం భారతీయ మహిళా క్రీడాకారులకు ఒక కలే అని చెప్పేందుకు తాజా సంఘటన నిదర్శనం.

అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడం భారతీయ మహిళా క్రీడాకారులకు ఒక కలే అని చెప్పేందుకు తాజా సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఆగస్టు 23-28 వరకు పోలాండ్‌లో జరగనున్న 4వ ప్రపంచ డెఫ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు జాతీయస్థాయి ట్రయల్స్‌లో 18 ఏళ్ల సమీహా బర్విన్ అనే బధిర బాలిక ఎంపికయింది. కానీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. సమీహాను పోటీలకు పంపించేందుకు ఆలిండియా డెఫ్ స్పోర్ట్స్ కౌన్సిల్(AISCD) నిరాకరించింది. సెలెక్ట్ అయిన ఆరుగురు అథ్లెట్లలో ఒక అమ్మాయి మాత్రమే ఉందని, దీంతో పాటు నిధుల కొరత కారణంగా ఆమెను పోలాండ్‌కు పంపించడం లేదని డెఫ్ కౌన్సిల్ వెల్లడించడం మరో విశేషం.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కదయాలుమూడుకి చెందిన ముజీబ్, సాలమత్‌ దంపతులకు సమీహా బర్విన్ జన్మించింది. పుట్టినప్పుడు సమీహా ఇతర పిల్లలలాగే వినగలిగేది, మాట్లాడగలిగేది. ఆరేళ్ల వయసులో వచ్చిన జ్వరం వల్ల ఆమె మాట్లాడే, వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయింది. దీనితో హోటల్ ఉద్యోగి అయిన ముజీబ్ తన కూతురిని నాగర్‌కోయిల్‌లోని ప్రత్యేకమైన స్కూల్లో చేర్పించారు. అక్కడ ఆమె క్రీడల్లో నైపుణ్యాలు పెంచుకుంది. హైజంప్, లాంగ్ జంప్‌ క్రీడల్లో అద్భుత ఆట ప్రదర్శన కనబరిచింది.

12 ఏళ్ల వయసు నుంచే క్రీడల్లో రాణించిన ఈమె జాతీయ డెఫ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణాలు సాధించింది. దీంతో తల్లిదండ్రులు సైతం ఆమెను ప్రోత్సహించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారులు నిరాకరించడంతో తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలాండ్‌లో జరగనున్న లాంగ్ జంప్‌లో పోటీ చేయడానికి తన బిడ్డ ఎంపికైనప్పటికీ పోటీలకు వెళ్ళనివ్వడంలేదని బార్విన్ తల్లి సలామత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు.

ఈ క్రమంలోనే కన్యాకుమారి లోక్ సభ ఎంపీ విజయ్ వసంత్.. సమీహాని పోలాండ్‌ ఛాంపియన్షిప్ పోటీలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ ద్వారా సమీహాను పోలాండ్‌ లో జరగనున్న పోటీలకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అయితే సమీహాని ఒంటరిగా పంపించడానికి సరిపోను నిధులు లేవని ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ది డెఫ్‌ విజయ్ కి సమాధానం ఇచ్చింది.

ఈ విషయంపై స్పందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) AISCD నుంచి నివేదికను తెప్పించింది. ఈ నివేదిక ప్రకారం, AISCD జూలై 22, 2021న సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించగా.. సమీహా బార్విన్ 200మీ రన్, లాంగ్ జంప్ ఈవెంట్‌లలో పాల్గొంది. కానీ అర్హత సాధించలేదు. శాయ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా సమీహాని చేశామని ఆరోపణలు నిజం కాదని తేల్చింది. కాగా దీనిపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

Published by:John Kora
First published:

Tags: Sports

ఉత్తమ కథలు