ప్రెగ్నెంట్ చేసి మోసం.. పదేళ్లుగా నరకం.. యువతికి స్టార్ క్రికెటర్‌ వేధింపులు

Babar Azam: బాబర్ అజామ్ ప్రేమ పేరుతో ప్రెగ్నెంట్ చేసి.. పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని.. 2017లోనే నసీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. కానీ తన పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చాడని ఆరోపించింది.

news18-telugu
Updated: November 29, 2020, 5:19 PM IST
ప్రెగ్నెంట్ చేసి మోసం.. పదేళ్లుగా నరకం.. యువతికి స్టార్ క్రికెటర్‌ వేధింపులు
బాబర్ అజామ్, బాధిత యువతి
  • Share this:
పాకిస్తాన్ (Pakistan) స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ (Babar Azam) చిక్కుల్లో పడ్డాడు. అతడిపై 26 ఏళ్ల ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. బాబర్ అజామ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని.. గర్భవతిని చేసి వదిలేశాడని ఆరోపించింది. పదేళ్లుగా నరకం చూపిస్తున్నాడని.. చంపేస్తానని కూడా బెదరిస్తున్నాడని.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. ఎక్కడా న్యాయం దొరకపోవడంతోనే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. బాబర్ అజామ్‌పై ఆ యువతి చేసిన వేధింపులు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి.

''బాబర్ అజామ్ నా స్కూల్ ఫ్రెండ్. ఇద్దరం ప్రేమించుకున్నాం. 2010లో అతడు నాకు ప్రపోజ్ చేశాడు. మా ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెబితే తిరస్కరించారు. 2011లో ఇంటి నుంచి పారిపోయాం. అద్దె ఇంట్లో ఉంటూ వచ్చాం. పెళ్లి చేసుకుందామని చెబితే బాబర్ అజామ్ వినలేదు. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి, మిత్రులతో కలిసి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత నన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి కొట్టేవాడు. చంపేస్తామని బెదిరిస్తున్నాడు. క్రికెట్‌లోకి రాకముందూ అతడి కోసం ఎన్నో చేశాను. ఆర్థికంగా అండదండగా ఉన్నాను. కానీ పాకిస్తాన్ టీమ్‌లో చోటు సంపాదించాక నన్ను వదిలేశాడు. నాకు న్యాయం కావాలి.'' అని బాధిత యువతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.


బాబర్ అజామ్ ప్రేమ పేరుతో తనను ప్రెగ్నెంట్ చేసి.. పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని.. 2017లోనే నసీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. కానీ తన పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చాడని ఆరోపించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పాకిస్తాన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


కాగా, బాబర్ అజామ్ ప్రస్తుతం తన జట్టుతో కలిసి న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మూడు టీ20లు, రెండు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐతే పాకిస్తాన్ జట్టులో ఏడుగురు సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో.. సిరీస్ ఆలస్యమవుతోంది. పాకిస్తాన్ టీమ్ మొత్తాన్ని 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచారు. అందులో బాబర్ అజామ్ కూడా ఉన్నాడు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను వేరొక ఫ్లోర్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు.
Published by: Shiva Kumar Addula
First published: November 29, 2020, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading