news18-telugu
Updated: November 26, 2020, 11:21 AM IST
Mayank Agarwal
రోహిత్ స్థానంలో ఎవరూ ఓపెనర్‌గా బరిలోకి దిగాలనే దానిపై సందిగ్ధత నెలకొన్న వేళ సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెస్టుల్లో ఓపెనర్ స్థానానికి మయాంక్ అగర్వాల్ బెస్ట్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ఆసీస్ పర్యటన మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో ఇప్పుడు కొత్త సమస్య టీమిండియాను వెంటాడుతోంది.
ఆసీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ దూరమవ్వడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై బీసీసీఐ కసరత్తులు మెుదలుపెట్టింది. శిఖర్ ధావన్‌తో ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు రాణించే సత్తా ఉన్నప్పటికి అయితే ఆ స్థానంలో అతన్ని బరిలోకి దింపుతారో.. లేదో అనుమానంగా ఉంది. అతన్ని మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు దింపాలనే బీసీసీఐ చూస్తో్ంది. అయితే ఓపెనింగ్ స్ధానంలో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
తొలిసారిగా మూడు ఫార్మాట్లలో (వన్డే, టీ20, టెస్టు) స్థానం దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ ఆస్ట్రేలియాలో పర్యటనలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఐపీఎల్-2020లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన మయాంక్ ఈ సిరీస్‌లోనూ అలాంటి ప్రదర్శనే కొనసాగించాలనుకుంటున్నాడు. అయితే ఓపెనింగ్ స్థానంలో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ కూడా దిగే అవకాశం కనిపిస్తోంది. వారి నుంచి మయాంక్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.
దీనిపై స్పందించిన సచిన్ " మయాంక్ ఆటతీరు ఎంతో మెరుగ్గా ఉంది. కావున అతను మంచి ఓపెనింగ్ అవకాశం. అతను మెరుగ్గా ఆడగలిగితే.. రోహిత్ ఫిట్నెస్ సాధించి.. జట్టులోకి వస్తే మయాంక్ తనకు మంచి జోడీ అవుతాడు. అలాగే ఈ సిరీస్‌లో ఫాంలో ఉన్న ఆటగాళ్ళును కూడా పక్కనపెట్టే అవకాశం ఉండదు’’ అంటూ పెర్కొన్నాడు.
Published by:
Rekulapally Saichand
First published:
November 26, 2020, 10:10 AM IST