క్రికెటర్ రాయుడుకి షాక్.. చర్యలకు రంగం సిద్ధం

కొద్దిరోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు హెచ్‌సీఏలో అవినీతి జరుగుతోందని అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు.

news18-telugu
Updated: November 29, 2019, 2:23 PM IST
క్రికెటర్ రాయుడుకి షాక్.. చర్యలకు రంగం సిద్ధం
అంబటి రాయుడు (Image : Twitter)
  • Share this:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి తారాస్థాయికి చేరిందని బహిరంగ ఆరోపణలు చేసిన క్రికెటర్‌ అంబటి రాయుడిపై చర్యలు తీసుకునేందుకు హెచ్‌సీఏ సిద్ధమవుతోంది. అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై నివేదికవచ్చిన తరువాత చర్యలు తీసుకోనున్నామని హెచ్‌సీఏ సభ్యుడు ఒకరు వెల్లడించారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగించేలా ఆరోప ణలు చేసిన రాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశిస్తామని నివేదిక సమర్పించిన తరువాత హెచ్‌సీఏ చర్యలు తీసుకుంటుందని అన్నారు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు హెచ్‌సీఏలో అవినీతి జరుగుతోందని అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు హైదారాబాద్‌ క్రికెట్‌ను శాసిస్తున్నారని ఆయన ఆరోపించాడు. హెచ్‌సీఏలో అవినీతిపై మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించాలని రాయుడు ట్వీట్‌లో కోరాడు. దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలను అజారుద్దీన్ వ్యక్తిగతంగా తీసుకోవద్దని ఆ తరువాత అంబటి రాయుడు వివరణ ఇచ్చారు.


First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు