Home /News /sports /

HBD SOURAV GANGULY VIRENDER SEHWAG POSTED A HILARIOUS BIRTHDAY WISHES FOR DADA IN HIS OWN STYLE SRD

HBD Sourav Ganguly : జూనియర్ ఎన్టీఆర్ గా సెహ్వాగ్..రామ్ చరణ్ గా గంగూలీ..పోలా..అదిరిపోలా..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

HBD Sourav Ganguly : రిటైర్మెంట్ అనంతరం నెట్టింట చురుగ్గా ఉంటున్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. సమయం, సందర్భాన్ని బట్టి తన ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాకు తనదైన స్టైల్ లో విషెస్ చెప్పాడు వీరేంద్రుడు.

ఇంకా చదవండి ...
    టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియాకు అతను చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ కదిలించినా.. ఎవరి స్టేటస్ చూసినా దాదా పేరే వినిపిస్తోంది. అతని రికార్డులు, ఘనతలను యావత్ క్రికెట్ ప్రపంచం నెమరువేసుకుంటుంది. సినీ, రాజకీయ, క్రీడా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు దాదాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో దాదా పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇక రిటైర్మెంట్ అనంతరం నెట్టింట చురుగ్గా ఉంటున్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. సమయం, సందర్భాన్ని బట్టి తన ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాకు తనదైన స్టైల్ లో విషెస్ చెప్పాడు వీరేంద్రుడు. టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్‌ని ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఒకే బుల్లెట్‌పై ప్రయాణిస్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంది.

    ఆ పోస్టర్‌ని మార్ఫింగ్ చేసిన మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్.. ఎన్టీఆర్ ప్లేస్‌లో తనను, రామ చరణ్ స్థానంలో సౌరవ్ గంగూలీని ఉంచాడు. ఇక బైక్‌కి ముందు జాతీయ జెండాని అమర్చి.. నెంబర్ ప్లేట్‌‌కి "దాదా" అని రాసుకొచ్ఛాడు . ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.





    అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్‌ మరో ట్వీట్ చేసి దాదాకు శుభాకాంక్షలు చెప్పాడు. "సౌరవ్ గంగూలీకి ఉన్న అభిరుచిని, ఉద్దేశాలను కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి వారిలో నేను ఒకడిని. హ్యాపీ బర్త్‌డే దాదా" అని ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడు గంగూలీ. భారతీయుల్లో మూడో వ్యక్తి. 311 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన గంగూలీ.. 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు సాధించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, RRR, Rrr movie, Sourav Ganguly, Virender Sehwag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు