ఈసారి అక్కడే కోహ్లీ బర్త్‌డే వేడుకలు... అనుష్కతో కలిసి...

#HappyBirthdayViratKohli : టీమిండియా సూపర్ హిట్టర్ విరాట్ కోహ్లీకి ప్రపంచమంతా ఉన్న అభిమానులు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. మరి కోహ్లీ ఎక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడో తెలుసా?

news18-telugu
Updated: November 5, 2019, 12:35 PM IST
ఈసారి అక్కడే కోహ్లీ బర్త్‌డే వేడుకలు... అనుష్కతో కలిసి...
రిటైర్మెంట్‌ తరువాత తాను వంటనేర్చుకోవాలనుకుంటున్నట్లు టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తెలిపాడు.
  • Share this:
HBD Virat Kohli : సెంచరీల వీరుడు విరాట్ కోహ్లీ... 31వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. గతేడాది తన భార్య అనుష్క శర్మతో కలిసి... పుట్టిన రోజు నాడు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కి వెళ్లాడు కోహ్లీ. అక్కడే వేడుకలు చేసుకున్నాడు. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరుపుకుంటాడా అని చాలా మంది ఎదురుచూశారు. ఈ ఏడాది కూడా తనకు సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో... పుట్టిన రోజును అనుష్కతో కలిసి భూటాన్‌లో జరుపుకుంటున్నాడు కోహ్లీ. అరుదైన రోజున, పవిత్రమైన పుణ్యక్షేత్రం భూటాన్‌లో తన భార్యతో కలిసి పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు కోహ్లీ. తనకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు (థాంక్స్) చెబుతున్నానని ట్వీట్ చేశాడు ఈ టీమిండియా కెప్టెన్.


క్రికెట్‌లోకి 15 ఏళ్లప్పటి నుంచీ ఎంటరైన కోహ్లీ... అప్పటి నుంచీ తనకు ఎదురైన అనుభవాల్ని స్వయంగా రాసి... ఫ్యాన్స్ కోసం ట్వీట్ చేశాడు. తన ఫ్యాన్స్‌తో ఆ విశేషాల్ని పంచుకుంటున్నట్లు తెలిపాడు.


ప్రస్తుతం కోహ్లీ ఖాళీగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడట్లేదు. ఆ తర్వాత జరిగే టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వనున్నా్డు. ఇలా రెస్ట్ తీసుకుంటున్న టైమ్‌లో పుట్టిన రోజు రావడంతో... కోహ్లీ ఫ్యామిలీ ఖుషీగా ఉంది. లాస్ట్ బర్త్‌డేని కూడా కోహ్లీ... ఫ్యామిలీతోనే జరుపుకోగలిగాడు. అప్పట్లో భారత్‌లో వెస్టిండీస్‌ టూర్‌ జరుగుతోంది. అప్పుడు కూడా టీ20లలోనే టీమిండియా పోటీపడింది.

 

Pics : చందనపు బొమ్మ సంజన క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

మొదట్లో నన్నూ తొక్కేశారు... మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు


HBD Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఫొటోలు... బర్త్‌డే స్పెషల్


వారానికి 3 రోజులు సెలవులు... ఉద్యోగులకు గుడ్ న్యూస్

HBD Kohli : హ్యాపీ బర్త్‌డే కోహ్లీ... రికార్డుల రారాజుకి విషెస్

Pics : ఢిల్లీలో పొగ ఎలా ఉందో ఈ ఫొటోలే చెబుతున్నాయి...

First published: November 5, 2019, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading