ఫ్లీజ్ నన్ను కాపాడండి.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: షమి భార్య హసిన్‌

క్రికెటర్‌ మహ్మద్‌ షమి భార్య హసిన్‌ జహాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. భర్తతో విభేదాల కారణంగా ఇనాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న హసిన్‌ తాజాగా మరో సమస్య ఆమెను వెంటాడుతోంది.

Rekulapally Saichand
Updated: August 12, 2020, 2:39 PM IST
ఫ్లీజ్ నన్ను కాపాడండి.. అత్యాచారం చేస్తామని  బెదిరిస్తున్నారు: షమి భార్య హసిన్‌
Mohammed-Shamis-Estranged-Wife-Hasin
  • Share this:
క్రికెటర్‌ మహ్మద్‌ షమి భార్య హసిన్‌ జహాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. భర్తతో విభేదాల కారణంగా ఇనాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న హసిన్‌ తాజాగా మరో సమస్య ఆమెను వెంటాడుతోంది. రామమందిరం భూమిపూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పలువురు నుంచి ఆమెకు బెదిరింపు సందేశాలు‌ వస్తు్న్నాయి. అత్యాచారం చేసి  హతమారుస్తామంటూ దుండగులు  హెచ్చరిస్తున్నారు. దీంతో ఆమె కోల్‌కతా సైబర్ నేర‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  క్రికెటర్‌ మహ్మద్‌ షమి భార్య హసిన్‌ జహాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. భర్తతో విభేదాల కారణంగా ఇనాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న హసిన్‌ తాజాగా మరో సమస్య ఆమెను వెంటాడుతోంది. రామమందిరం భూమిపూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పలువురు నుంచి ఆమెకు బెదిరింపు సందేశాలు‌ వస్తు్న్నాయి. అత్యాచారం చేసి  హతమారుస్తామంటూ దుండగులు  హెచ్చరిస్తున్నారు. దీంతో ఆమె కోల్‌కతా సైబర్ నేర‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవలే అయోధ్యలో జరిగిన శ్రీరామధామం భూమిపూజ సందర్భంగా జహాన్‌ "రామమందిర భూమి పూజ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు’ అంటూ సామాజిక మాధ్యమాలలో పెట్టిన సందేశం ఈ బెదిరింపు కాల్స్‌కు కారణమైనట్లు తెలుస్తోంది. మంగళవారం హసిన్‌ పోలీస్ స్టేషన్ వెళ్ళి వారిపై ఫిర్యాదు చేసింది. ఆ కంప్లైంట్‌లో పలు విషయాలను సేర్కొన్నారు.

"అయ్యోధ్య భూమి పూజా సందర్భంగా హిందువులకు విషెస్ తెలియజేసినందుకు కొందరు నన్ను హింసించడం, దూషించడం చేస్తున్నారు. మరికొందరు ఏకంగా చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం నేను ఒంటరి. నా కూతురు భవిష్యత్ కోసమే నేను ఆలోచిస్తున్నాను. సోషల్ మీడియాలో బెదిరింపులు రావడం భయంగా ఉంది. ఇలాంటి సందేశాలు రాకుండా వారిపై వెంటనే చర్యలు తీసుకోండి" అంటూ పోలీసులకు పిర్యాదు చేశారు.
Published by: Rekulapally Saichand
First published: August 12, 2020, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading