HASAN ALI ALI ISSUES STATEMENT AND APOLOGIES TO FANS AFTER HIS CATCH DROP IN SEMIFINAL AGAINST AUSTRALIA SRD
Hasan Ali : " సారీ.. పెద్ద తప్పు చేశాను.. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ చేయను.. "
Hasan Ali
Hasan Ali : ఈ మ్యాచ్ తర్వాత హసన్ అలీ పై పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో అయితే అలీ పై పాక్ అభిమానులు ఓ చిన్న సైజు యుద్ధమే నడిపారు. ఈ సంగ్రామలో అలీ భార్య సయామీ కూడా బాధితురాలిగా మారింది.
టీ-20 వరల్డ్ కప్ 2021 (T-20 World Cup 2021) ఆఖరి అంకానికి చేరుకుంది. మెగా ఫైనల్ కి కాసేపట్లో తెరలేవనుంది. చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (Australia Vs New Zealand) లు మెగా ఫైనల్ లో తలపడనున్నాయ్. ఇక, మెగాటోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపిన పాకిస్థాన్ జట్టు సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో కంగు తిన్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హసన్ అలీ చేసిన ఘోర తప్పిదం పాకిస్థాన్ కొంపముంచింది. 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను హసన్ అలీ (Hasan Ali )చేజార్చగా.. ఆ అవకాశాన్ని అందుకున్న వేడ్ రెండు భారీ సిక్స్‌లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
12.2 ఓవర్లకే ఆస్ట్రేలియా జట్టు ఐదు కీలక వికెట్లను కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఇక.. మ్యాచ్ గెలిచేది నిలిచేది తమ జట్టేనని పాక్ అభిమానులు భావించారు.మ్యాచ్ చివరి వరకూ అదే నమ్మకం వాళ్లలో ఉంది. కానీ.. 19వ ఓవర్లో మ్యాథ్యూ వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ మిస్ చేయడంతో మ్యాచ్ తీరే మారిపోయింది. ఆ తరువాత మ్యాథ్యూ వేడ్ హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగి ఆస్ట్రేలియా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పాకిస్తాన్ అభిమానులకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడానికి కారణం ఎవరనే ప్రశ్న తలెత్తితే పాకిస్తాన్ అభిమానుల్లో మెజార్టీ ఫ్యాన్స్ హసన్ అలీ వైపే వేళ్లు చూపించారు.
میرا سینہ تیری حُرمت کا ہے سنگین حصار،
میرے محبوب وطن تُجھ پہ اگر جاں ہو نثار
ఈ మ్యాచ్ తర్వాత హసన్ అలీ పై పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో అయితే అలీ పై పాక్ అభిమానులు ఓ చిన్న సైజు యుద్ధమే నడిపారు. ఈ సంగ్రామలో అలీ భార్య సయామీ కూడా బాధితురాలిగా మారింది. గడిచిన మూడు రోజులుగా పాక్ అభిమానులు.. అలీ, అతడి భార్యపై సైబర్ దాడి కొనసాగిస్తున్న నేపథ్యంలో అతడు స్పందించాడు. ఫ్యాన్స్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అభిమానుల అంచనాలు అందుకోవడంలో తాను దారుణంగా విఫలమయ్యానని వాపోయాడు. కానీ తాను మాత్రం ఈ ఓటమి నుంచి చాలా నేర్చుకున్నానని, ఇకపై ఉత్తమ ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు.
అలీ పై సైబర్ దాడి నేపథ్యంలో పలువురు పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా అతడికి మద్దతుగా నిలిచారు. ఉపఖండపు దేశాల్లో క్రికెటర్లకు ఇటువంటి అనుభవాలు తప్పవని, అన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని అలీకి సూచించారు.
మరోవైపు, ఆటలో గెలుపుఓటములు సహజమని, హసన్ అలీపై ఈ స్థాయిలో రెచ్చిపోయి, దిగజారి విమర్శలు చేయడం.. అతని కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అతనికి మద్దతు తెలుపుతున్న నెటిజన్లు మెజార్టీ ఇండియన్స్ కావడం విశేషం. #INDwithHasanAli అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుందంటే అతనికి మన వాళ్లు ఎంతలా అండగా నిలిచారో చెప్పొచ్చు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.