Telugu Titans Vs Haryana Steelers : తగ్గేదే లే.. సమఉజ్జీలుగా రెండు జట్లు.. మరో మ్యాచ్ టై..

Telugu Titans Vs Haryana Steelers : తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయ్. దీంతో, మరో మ్యాచ్ ను టైగా ముగిసింది. ఆఖర్లో కీలక తప్పిదాలు చెల్లించి భారీ మూల్యం చెల్లించుకుంది. లేకపోతే మ్యాచ్ గెలిచి ఉండేది. దీంతో.. మ్యాచ్ ముగిసే సమయానికి 39-39 పాయింట్లతో రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయ్. హర్యానా స్టీలర్స్ లో వికాస్ కండోలా సూపర్ -10 తో తెలుగు టైటాన్స్ పై ఒత్తిడి పెంచాడు. తెలుగు టైటాన్స్ లో అంకిత్ బెన్వాల్ సూపర్ -10 తో ఆకట్టుకున్నాడు. తెలుగు టైటాన్స్ లో హీరో మాత్రం కచ్చితంగా సందీప్ కండోలానే. తన స్ట్రాంగ్ డిఫెన్స్ తో కీలక పాయింట్ల సాధించాడు. సందీప్ తన డిఫెన్స్ తో ఆరు పాయింట్లు సాధించాడు.

  • News18 Telugu
  • | January 25, 2022, 20:42 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 4 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    20:49 (IST)
    20:38 (IST)

    తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయ్. దీంతో, మరో మ్యాచ్ ను టైగా ముగిసింది. ఆఖర్లో కీలక తప్పిదాలు చెల్లించి భారీ మూల్యం చెల్లించుకుంది. లేకపోతే మ్యాచ్ గెలిచి ఉండేది. దీంతో.. మ్యాచ్ ముగిసే సమయానికి  39-39 పాయింట్లతో రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయ్. హర్యానా స్టీలర్స్ లో వికాస్ కండోలా సూపర్ -10 తో తెలుగు టైటాన్స్ పై ఒత్తిడి పెంచాడు. తెలుగు టైటాన్స్ లో అంకిత్ బెన్వాల్ సూపర్ -10 తో ఆకట్టుకున్నాడు. తెలుగు టైటాన్స్ లో హీరో మాత్రం కచ్చితంగా సందీప్ కండోలానే. తన స్ట్రాంగ్ డిఫెన్స్ తో కీలక పాయింట్ల సాధించాడు. సందీప్ తన డిఫెన్స్ తో ఆరు పాయింట్లు సాధించాడు. 

    20:27 (IST)

    మరోసారి హర్యానా స్టీలర్స్ మ్యాచులో ఆధిక్యంలోకి వచ్చింది. 38-33 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది హర్యానా. 

    20:19 (IST)

    ప్రతి పాయింట్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. దీంతో ప్రస్తుతం 32-32 పాయింట్లతో రెండు జట్లు సమంగా నిలిచాయ్. 

    20:16 (IST)

    ప్రతి పాయింట్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. దీంతో ప్రస్తుతం 30-30 పాయింట్లతో రెండు జట్లు సమంగా నిలిచాయ్. 

    20:13 (IST)
    20:12 (IST)

    హర్యానా స్టీలర్స్ సెకండాఫ్ లో ఆలౌట్ అయింది. దీంతో ఫస్ట్ టైం ఈ మ్యాచులో లీడింగ్ లోకి వచ్చింది తెలుగు టైటాన్స్. ప్రస్తుతం 30-28 పాయింట్లతో లీడింగ్ లో ఉంది తెలుగు టైటాన్స్. 

    20:10 (IST)

    ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు హోరా హోరీగా తలపడతున్నాయ్. ప్రస్తుతం 26-26 తో రెండు జట్లు సమంగా నిలిచాయ్ రెండు జట్లు. 

    20:9 (IST)

    ప్రస్తుతం 26-23 పాయింట్లతో లీడింగ్ లో ఉంది హర్యానా స్టీలర్స్. 

    20:7 (IST)

    ఫస్ట్ టైం ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ రోహిత్ కుమార్.. సూపర్ రైడ్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం 24-23 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది హర్యానా స్టీలర్స్. 

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌ (Telugu Titans)కు పెద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ దరిద్రం టైటాన్స్ కు పట్టుకున్నట్టుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్.. 14 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. ఇప్పుడు టైటాన్స్ ది కూడా అదే పరిస్థితి.

    ప్రొకబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. దీంతో, ఫ్యాన్స్ తెలుగు టైటాన్స్ పై ఫైరవుతున్నారు. అచ్చం సన్ రైజర్స్ టీమ్ లానే మీరు కూడా మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా స్టీలర్ట్ తో అమీతుమీ తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్. కనీసం, ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకుంటే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. అందుకే అతన్ని గత మ్యాచులో పక్కన పెట్టారు. అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. కానీ, వీళ్లు కూడా స్థాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు.

    ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ గాయంతో.. జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. గత రెండు మ్యాచుల్లో ఆదర్శ్ టి మెరుగైన ప్రదర్శన చేశాడు.

    మరోవైపు, హర్యానా స్టీలర్స్ ఈ సీజన్ లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఆడిన 13 మ్యాచుల్లో ఆరింటిలో నెగ్గి.. ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచులు టైగా ముగిశాయ్. దీంతో, పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది. వికాస్ కండోలా, మీతూ శర్మ, రోహిత్ గులియా వంటి స్టార్ రైడర్లు ఉన్నారు. వీరితో పాటు జై దీప్ దహియా, రవి కుమార్, సురేందర్ నాడా వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు కూడా ఉన్నారు. వీరందరూ ఫామ్ లోకి వస్తే.. హర్యానా స్టీలర్స్ ను ఆపడం కష్టమే

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా.. రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయ్. తెలుగు టాటైన్స్ 3 సార్లు నెగ్గగా.. 3 సార్లు హర్యానా స్టీలర్స్ విజయ కేతనం ఎగురవేసింది. ఈ సీజన్ లో హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ ఓడిపోయింది.

    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : అంకిత్ బెన్వాల్, రాకేశ్ గౌడ, ఆకాశ్ చౌదరి, ఆదర్శ్ టి, ప్రిన్స్ డి, సురేందర్ సింగ్, సందీప్ కండోలా

    హర్యానా స్టీలర్స్ : వికాస్ కండోలా, వినయ్, రవి కుమార్, రోహిత్ గులియా, మోహిత్ , సురేందర్ నాడా, జైదీప్ కుల్దీప్

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    హర్యానా స్టీలర్స్ :

    రైడర్స్: మొహమ్మద్ ఇస్మాయేల్, వికాస్ చిల్లర్, వికాశ్ కండోలా, వినయ్,

    డిఫెండర్స్ : రవి కుమార్, చంద్ సింగ్, రాజేశ్ గుర్జార్, సురేందర్ నాదా,

    ఆల్‌రౌండర్స్: అజయ్, బ్రిజేందర్ చౌదరి, హమీద్ నదీర్, రాజేశ్ నర్వాల్, రోహిత్ గులియా, వికాస్ జగ్లన్