HARSHIT SETH NAMED U19 YOUNG CRICKETER CREATED A HISTORY TOOK 6 WICKETS IN 6 BALLS IN KARWAN GLOBAL LEAGUE SRD
Double Hatrick : క్రికెట్ లో అద్భుతం.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. మనోడే దుమ్మురేపాడు..!
Image Credit : Twitter
Double Hatrick : సాధారణంగా క్రికెట్ లో హ్యాట్రిక్ తీయడం గొప్పగా భావిస్తాం. అలాంటిది ఒకే ఓవర్ లో డబుల్ హ్యాట్రిక్ (Double Hatrick) అంటే నమ్మగలమా..? నమ్మలేం. అసలు ఆ ఆలోచనను కూడా ఊహించలేంది.
క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. సాధారణంగా క్రికెట్ లో హ్యాట్రిక్ తీయడం గొప్పగా భావిస్తాం. అలాంటిది ఒకే ఓవర్ లో డబుల్ హ్యాట్రిక్ (Double Hatrick) అంటే నమ్మగలమా..? నమ్మలేం. అసలు ఆ ఆలోచనను కూడా ఊహించలేంది. సాధ్యమేనా అనే అనుకున్న రికార్డును సుసాధ్యం చేశాడు ఓ యంగ్ కుర్రాడు. ఈ అద్భుత ఘట్టం దుబాయ్ (Dubai) వేదికగా ఆవిష్కృతమైంది. దుబాయ్ వేదికగా జరిగిన కర్వాన్ అండర్-19 గ్లోబల్ లీగ్ టీ20 టోర్నీలో భారత సంతతి(ఢిల్లీ)కి చెందిన స్థానిక కుర్రాడు హర్షిత్ సేథ్ (Harshit Seth) ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ అకాడమీ ఆర్సీజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ స్టార్లెట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్షిత్.. డబుల్ హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు(4-0-4-8) సాధించడంతో పర్యాటక జట్టు 44 పరుగులకే కుప్పకూలింది.
“A Perfect Over”.
Harshit created a history in the U19 Cricket yesterday when he took 6 wickets in 6 balls in a U19 league match against U19 team from Pakistan. The match held in Ajman Oval approved by Ajman Cricket Council organized by Karwan called Karwan Global League!!!!! pic.twitter.com/dGoQuynDIc
ప్రస్తుత క్రికెట్‌లో దాదాపుగా అసాధ్యమైన డబుల్ ఈ హ్యాట్రిక్ ఫీట్‌ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్షిత్ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 28న జరిగిన ఈ ఘట్టం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘట్టం ఇంతవరకు ఆవిష్కృతం కాలేదు. అయితే, 2017 జనవరిలో ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో ఇలాంటి ఘట్టమే ఆవిష్కృతమైంది.
గోల్డన్ పాయింట్ క్రికెట్ క్లబ్ తరఫున అలెడ్ క్యారీ డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకుముందు 1930లో భారత స్కూల్ క్రికెట్‌లో వైఎస్ రామస్వామి, 1951లో ఇంగ్లండ్ లోకల్ క్రికెట్‌లో జి సిరెట్ ఈ రికార్డును సాధించినట్లు తెలుస్తోంది. మొత్తానికి హర్షిత్ సేథ్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.