hardik-pandya: సార్ డ్యూటీ మారాడు... ఆమ్మ పని చేస్తున్న నాన్న

hardik pandya

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పితృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఐపీఎల్,ఆస్ట్రేలియా టూర్ కారణంగా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోయాడు.

  • Share this:
    టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పితృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఐపీఎల్,ఆస్ట్రేలియా టూర్ కారణంగా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోయాడు. ఆ పర్యటన ముగియడంతో హార్థిక్ తిరిగి ఇండియా చేరుకున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పితృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. ఐపీఎల్,ఆస్ట్రేలియా టూర్ కారణంగా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోయాడు. ఆ పర్యటన ముగియడంతో హార్థిక్ తిరిగి ఇండియా చేరుకున్నాడు. తాజాగా  తన కొడుకు అగస్త్యకి బుడ్డీతో పాలు పట్టిస్తున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దేశ సేవ నుంచి పితృ బాధ్యతకు మారినట్లు ఓ క్యాప్షన్ కూడా జతచేశాడు.







    కొడుకు తనవి తీర చూసుకోకుండానే వరుస షెడ్యూల్‌తో బిజీగా మారిపోయాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో కోసం అక్కడి వెళ్ళిన హార్దిక్ పాండ్యా ఆ  టోర్నీ ముగిసిన వెంటనే నేరుగా ఆస్ట్రేలియాకి వెళ్లిపోయాడు. ఇలా నాలుగు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ పర్యటనలు ముగియడంతో ఇప్పుడు కొడుకుతో బిజీ అయిపోయాడు. టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం హార్ధిక్‌కు ఉన్నప్పటికి  సిరీస్‌లో ఆడేందుకు హార్దిక్ పాండ్యా విముఖత చూపాడు. తన బిడ్డను నాలుగు నెలుగా చూడలేదని.. కుటుంబానికి సమయం కేటాయించాల్పిన సమయం వచ్చిందని.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా వెల్లడించారు. ఇక టీ20,వన్డే సిరీస్ హార్ధిక్ విశేషంగా రాణించాడు.
    Published by:Rekulapally Saichand
    First published: