పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...

ఆరు నెలల్లోనే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చిన హార్ధిక్ పాండ్యా... తాజాగా ఈషా గుప్తాతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు

news18india
Updated: June 13, 2018, 4:39 PM IST
పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...
ఆరు నెలల్లోనే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చిన హార్ధిక్ పాండ్యా... తాజాగా ఈషా గుప్తాతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు
  • Share this:
గత ఏడాది టీమిండియాలోకి మెరుపులా దూసుకొచ్చిన కుర్రాడు హార్ధిక పాండ్యా. బంతితో వికెట్లు తీస్తూ, బ్యాటుతో సిక్సులు కొడుతూ యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ ఆల్ రౌండర్. మిగిలిన ఆటగాళ్లందరూ విఫలమైన ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్లోనూ పాండ్యా ఆట ఎంతగానో ఆకట్టుకుంది. గ్రౌండులో తన ఆటతో అందరినీ కట్టిపాడేస్తున్న ఈ ముంబై కుర్రాడు, గ్రౌండు బయట వలపు బాణాలను సంధించి అమ్మాయిలను పడేస్తున్నాడు. మనోడి మాయలో పడ్డ వారందరూ బాలీవుడ్ భామలూ, పాపులర్ మోడల్స్ కావడం విశేషం.

సీనియర్ ఆటగాళ్లను తలదన్నేలా ఇప్పటికే మనోడి మీద అనేక రకాల రూమర్స్ రావడం గమనిస్తే, హార్ధిక్ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్థమవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు ఎల్లీ అవ్రామ్, ఊర్వశి రౌతెల్లా వంటి భామలతో హార్ధిక్ డేటింగులో ఉన్నాడనే వార్తలు రాగా, ఇప్పుడు ఈ లిస్టులోకి సోషల్ మీడియా సంచలనం ఈషా గుప్తా వచ్చి చేరింది. సోషల్ మీడియాలో నగ్న ఫోటోలతో తెగ వార్తల్లో నిలిచిన ఈషా గుప్తా, సచిన్ హీరోగా రూపొందిన ‘వాడెవడు’ చిత్రం ద్వారా తెలుగులోనూ కనిపించింది.

ఈ ఏడాది ఆరంభంలో మోడల్ ఎల్లీ అవ్రామ్ తో హార్ధిక్ చనువుగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. హార్ధిక్ అన్న కునాల్ పాండ్యా పెళ్లిలోనూ ఎల్లీ, హార్థిక్ తో కలిసి తెగ సందడి చేసింది. అంతేకాదు క్రికెటర్ల భార్యలందరూ కలిసి చేసుకునే పార్టీల్లోనూ ఎల్లీ అవ్రామ్ కనిపించేది. కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... హార్ధిక్ పాండ్యానే. అయితే మధ్యలో ఏమైందో ఏమో ఏప్రిల్ వచ్చేసరికి మిస్ యూనివర్స్ ఇండియా - 2012 ఊర్వశితో పార్టీ చేసుకుంటూ కనిపించాడు హార్ధిక్ పాండ్యా. వీరిద్దరూ డ్రెస్సులు మార్చుకున్నట్టు కూడా ఫోటోలను చూస్తే అర్థమైంది.


esha gupta
ఈషా గుప్తా


అయితే ఇది జరిగి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. ఈషా గుప్తాతో హార్ధిక్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఒక పార్టీలో కలుసుకున్న వీరు, నెంబర్లు మార్చకుని... అంతలోనే క్లోజ్ అయిపోయారని సమాచారం. అయితే ఈషా గుప్తా కూడా ఇంతకు ముందు ఫుట్ బాల్ ప్లేయర్ హెక్టర్ బెర్లిన్ తో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఆరు నెలల్లోనే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చిన హార్ధిక్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
Published by: Ramu Chinthakindhi
First published: June 7, 2018, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading