హార్దిక్ పాండ్యా, రాహుల్‌‌పై నిషేధం ఎత్తేసిన బీసిసిఐ

Hardik Pandya, KL Rahul's Sexist Comments: హార్థిక్ పాండ్యా,కె ఎల్ రాహుల్‌పై బీసిసిఐ నిషేధం ఎత్తేసింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు వీరిద్దరూ అందుబాటులో ఉంటారు.

news18-telugu
Updated: January 24, 2019, 6:12 PM IST
హార్దిక్ పాండ్యా, రాహుల్‌‌పై నిషేధం ఎత్తేసిన బీసిసిఐ
‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో పాల్గొన్న సమయంలో హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్
news18-telugu
Updated: January 24, 2019, 6:12 PM IST
హార్థిక్ పాండ్యా,కె ఎల్ రాహుల్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌ ( బీసిసిఐ ) నిషేధం ఎత్తేసింది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు వీరిద్దరూ అందుబాటులో ఉంటారు. కొంతమంది భారత మాజీ క్రికెటర్లు పాండ్యా,రాహుల్ మాట్లాడిన తీరుపై మండిపడగా...మరికొంతమంది క్రికెట్ దిగ్గజాలు నిషేధించడం సరైన నిర్ణయం కాదని బీసిసిఐని విమర్శించారు. 'కాఫీ విత్ కరణ్‌' షోలో అభ్యంతరకర కామెంట్స్ చేసిన వీరిద్దరిపై బోర్డ్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ నుంచి ఈ ఇద్దరినీ నిషేధించింది. ఆసీస్‌తో తొలి వన్డేకు ముందు స్వదేశానికి తిరిగొచ్చిన పాండ్యా, రాహుల్ బీసిసిఐకి 'భేషరతు' క్షమాపణలు చెబుతూ వివరణ లేఖ రాశారు. బీసిసిఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ సిఫార్స్ మేరకు వీరిద్దరిపై ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ..కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చింది. తప్పు చేసిన ఆటగాళ్లను సరిదిద్దితే చాలు..వారి కెరీర్ ముగిసేలా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని వినోద్ రాయ్ బోర్డ్‌కు సూచించారు.

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న పాండ్యా, రాహుల్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ షోలో హద్దులు దాటి మాట్లాడిన పాండ్యా.. తాను ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నాడో, పార్టీల్లో అమ్మాయిలను ఎలా చూసేవాడో వివరించాడు. జేబులో కండోమ్ ప్యాకెట్స్ చూసినా తన తండ్రి ఏమీ అనే వాడు కాదని రాహుల్ గొప్పలు చెప్పుకున్నాడు.

అసలే కె ఎల్ రాహుల్ ఇంటర్నేషనల్ కెరీర్ సక్రమంగా సాగట్లేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టులో చోటు నిలుపుకుంటూ వస్తోన్న హార్దిక్ పాండ్యా...గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చాడు. కాఫీ విత్ కరణ్ షోలో చేసిన కామెంట్స్ వీరి కెరీర్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని భావించారంతా. అయితే బీసిసిఐ ఎట్టకేలకు కనికరం చూపడంతో 'సెక్సిస్ట్ కామెంట్స్ ఎపిసోడ్‌'కు తెరపడింది. పాండ్యా,రాహుల్ కామెంట్స్‌ సరైనవి కావంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం స్పందించాడు. వీరిద్దరి తిరిగి జాతీయ జట్టుకు ఎంపికైనా...ఎలా ఆడతారో చూడాలి.First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...