పాండ్యా, రాహుల్‌ను 2 వన్డేల నుంచి తప్పించండి... సీఓఏ వినోద్ రాయ్ సూచన...

బీసీసీఐ లీగల్ సెల్‌కు వివాదాన్ని బదిలీ చేసిన సీఓఏ వినోద్ రాయ్... హార్ధిక్ పాండ్యా ఇచ్చిన వివరణ సంతృప్తినివ్వలేదంటూ వ్యాఖ్య... సీఓఏ డయానా ఎడుల్జీదే చివరి నిర్ణయం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 2:03 PM IST
పాండ్యా, రాహుల్‌ను 2 వన్డేల నుంచి తప్పించండి... సీఓఏ వినోద్ రాయ్ సూచన...
‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో పాల్గొన్న సమయంలో హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 2:03 PM IST
ఆసీస్ టూర్‌లో ఘోరంగా విఫలమయ్యాడు భారత ఓపెనర్ కెఎల్ రాహుల్... పూజారా, కోహ్లీ, మయాంక్ అగర్వాల్... ఇతర బ్యాట్స్‌మెన్ కొద్దోగొప్పో రాణించడంతో ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది టీమిండియా. గాయం కారణంగా జట్టుకు దూరమై, వన్డే సిరీస్ కోసం వచ్చిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... ఈ ఇద్దరూ అనుకోని చిక్కుల్లో చిక్కుకున్నారు. హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొని... రచ్చ రచ్చ చేసిన ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్లు, ఆ షోలో మాట్లాడిన కొన్ని అనుచిత వ్యాఖ్యల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

ఇప్పటికే ఫామ్ కోల్పోయి సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ బారిన పడిన ఓపెనర్ కెఎల్ రాహుల్... పాండ్యా చేసిన ఓ చిలిపి వ్యాఖ్య కారణంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ‘టాక్ షో’ రచ్చ ఎంతవరకూ వెళ్లిందంటే... ‘అక్కడ అలా ఎందుకు మాట్లాడారు... మాకు 24 గంటల్లో వివరణ ఇవ్వాలి...’ అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షోకాజ్ నోటీసులు ఇచ్చేదాకా! తాజాగా పాండ్యా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ సీఓఏ (కమిటీ ఆడ్మినిస్టేటర్ చీఫ్) వినోద్ రాయ్... ఇద్దరికీ రెండు వన్డేల నుంచి తప్పించాలని సూచించారు.

బీసీసీఐ లీగల్ సెల్‌కు ఈ వివాదాన్ని మళ్లిచ్చిన వినోద్ రాయ్... ‘హార్ధిక్ పాండ్యా ఇచ్చిన వివరణ నాకు సంతృప్తినివ్వలేదు. అందుకే ఇద్దరికీ రెండు వన్డేల నుంచి తప్పిస్తే తిక్క కుదురుతుంది. సీఓఏ డయానా ఎడుల్జీకే ఫైనల్ డిసిషన్ తీసుకునే అధికారాన్ని ఇచ్చేశాం. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి...’ అన్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే... కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహారించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో సహచరుడు కెఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఈ సందర్భంగా మనోడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ... ‘మా ఇంట్లోవాళ్లతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సెక్స్‌కు సంబంధించిన విషయాలు కూడా చెబుతుంటా. అమ్మాయిలతో ఎంజాయ్ చేసినప్పుడు కూడా వారి దగ్గర ఆ విషయాలు దాచను. నేను ఫస్ట్ టైమ్ సెక్స్ చేసిన సందర్భం కూడా చెప్పాను...’ అంటూ వ్యాఖ్యానించిన హార్ధిక్ పాండ్యా... ‘అమ్మాయిల బ్యాక్ నాకెంతో సెక్సీగా అనిపిస్తుంది. వాళ్ల బ్యాక్ అందాలు చూసేందుకే నేను వెనక నడుస్తూ ఉంటా...’ అంటూ రెచ్చిపోయే వ్యాఖ్యలు చేశాడు. అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు పురుషాహంకారం స్పష్టంగా కనిపించేలా... ‘అది, ఇది, దాన్ని’ అంటూ ఉచ్ఛరిస్తూ మాట్లాడాడు హార్ధిక్ పాండ్యా. దాంతో మహిళా సంఘాల పాటు క్రికెట్ అభిమానులు మనోడి వైఖరిని కామెంట్లతో చీల్చి చెండాడేస్తున్నారు. దాంతో స్పందించిన హార్ధిక్ పాండ్యా... ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.



Hardik Pandya, KL Rahul Face Two-ODI Ban for 'Sexist' Remarks on Koffee With Karan పాండ్యా, రాహుల్‌లను రెండు వన్డేల నుంచి తప్పించండి... బీసీసీఐకి వినోద్ రాయ్ సూచన
హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ (Photo: twitter)


‘కాఫీ విత్ కరణ్’ షోలో నేను మాట్లాడిన మాటలు ఎవ్వరినైనా బాధపెట్టిఉంటే నన్ను క్షమించండి... నేను ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు. కొంచెం అతి చేశాను...’ అంటూ పేర్కొన్నాడు హార్ధిక్ పాండ్యా. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యాను, అతనితో పాటు టీవీ కార్యక్రమంలో పాల్గొన్న కెఎల్ రాహుల్‌ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు పంపించింది బీసీసీఐ. 24 గంటల్లో అలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వాలని కోరింది. ఇదే షోలో... ‘సచిన్ టెండుల్కర్ కంటే విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మెన్’ అంటూ ఈ ఇద్దరూ చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి.
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...