Hardik Pandya: త్యాగశీలివయ్యా పాండ్యా.. Man Of The Series ను వదులుకున్న మహానుభావుడు..

natarajan (image credits to twitter)

భారత క్రికెట్ లో హిట్టర్ Hardik Pandya మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఈసారి కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో కాదు.. త్యాగ గుణం ప్రదర్శించి అందరి అభిమానులు చురగొన్నాడు.

  • News18
  • Last Updated :
  • Share this:
    భారత క్రికెట్ లో మరో కపిల్ దేవ్ గా కీర్తించబడుతున్న Hardik Pandya మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తనకు దక్కిన పురస్కారాన్ని ఇతరులకు అందించాడు. ఈ అవార్డు దక్కాల్సింది తనకు కాదని.. అది చేరాల్సిన చోటకు చేర్చాడు. హర్థిక్ పాండ్యా చేసిన పనికి.. తోటి క్రీడాకారుడిపై అతడు చూపిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. హర్థిక్ ది గొప్ప మనసు అని అభినందనలు తెలుపుతున్నారు. యువ క్రికెటర్ ను ప్రోత్సహిస్తున్న పాండ్యా ను చూసి.. అభిమానులు త్యాగమూర్తివయ్యా.. అంటూ కీర్తిస్తున్నారు. ఇంతకీ హర్థిక్ ఏం చేశాడంటే...

    ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ముగిసింది. మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. అయినా 2-1 తో సిరీస్ గెలుచుకుంది. వన్డేలో కంగారూల చేతిలో చతికిలపడిన దానికి బదులు తీర్చుకుంది. కాగా, మూడో టీ 20 మ్యాచ్ ముగిసి.. అవార్డుల ఫంక్షన్ కూడా అయిపోయింది. టీ 20 సిరీస్ లో బ్యాటింగ్ లో అద్భుత ప్రతిభ చూపడమే కాకుండా.. రెండో టీ 20 లో భారత్ ను విజయ తీరాలకు చేర్చినందుకు గానూ హార్థిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. కానీ అతడు దానిని తన సహచర ఆటగాడు నటరాజన్ (T. Natarajan) కు ఇచ్చేశాడు.





    తమిళనాడుకు చెందిన నటరాజన్.. ఇటీవలే భారత క్రికెట్ లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఈ టీ 20 సిరీస్ లో భారత విజయానికి అతడు కూడా ముఖ్య కారణం. ఈ లెఫ్టార్మ్ సీమర్.. తన అద్భుత బౌలింగ్ తో కంగారూలను నిలువరించాడు. వాళ్లు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించింది కూడా నటరాజనే.









    రెండో వన్డే లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా పాండ్యా.. ఈ అవార్డుకు నటరాజనే అర్హుడని బహిరంగంగా ప్రకటించాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే భారత్ నెగ్గిందని నటరాజన్ పై ప్రశంసలు కురిపించాడు. కాగా.. తాజాగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను తనకు వచ్చినా.. దానిని కూడా నటరాజన్ కే అందజేయడం గమనార్హం. పాండ్యా చేసిన పని క్రీడాభిమానులతో పాటు.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాండ్యాకు ట్విట్టర్ లో ప్రశంసలు దక్కుతున్నాయి.





    మ్యాచ్ అయిపోయిన తర్వాత పాండ్యా స్పందిస్తూ.. తన కుటుంబాన్ని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. తన బిడ్డను చూడక నాలుగు నెలలవుతుందని.. తనను ఎంతగానో మిస్ అవుతున్నానని అన్నాడు పాండ్యా..
    Published by:Srinivas Munigala
    First published: