హోమ్ /వార్తలు /క్రీడలు /

Father's Day : ఫాదర్స్ డే రోజు హార్దిక్ పాండ్యా భావోద్వేగ పోస్టు.. క్రికెటర్ల విషెస్ చూశారా?

Father's Day : ఫాదర్స్ డే రోజు హార్దిక్ పాండ్యా భావోద్వేగ పోస్టు.. క్రికెటర్ల విషెస్ చూశారా?

ఫాదర్స్ డే రోజు క్రికెటర్ల భావోద్వేగ సందేశాలు

ఫాదర్స్ డే రోజు క్రికెటర్ల భావోద్వేగ సందేశాలు

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేను (Father's Day) జరుపుకుంటున్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తొలి హీరో నాన్ననే. అమ్మంటే ప్రేమ.. నాన్నంటే బయం అని అందరూ చెబుతుంటారు. నాన్నంటే భయం ఉన్నా గుండెల్లో మాత్రం ఎనలేని ప్రేమ ఉంటుంది. మన జీవితాన్ని నిలబెట్టడానికి అహోరాత్రాలు కష్డపడుతుండే హీరో నాన్న. మనకు సమాజం విలువ, సమాజం నుంచి స్పూర్తిని నేర్పించేది నాన్నే.

వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా క్రికెటర్లు (cricketers) తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన నాన్న గురించి ఒక భావోద్వేగ పోస్టు పెట్టాడు. 'నాన్నా... మీ పెంపకం గురించి చాలా చెప్పేది ఉన్నది. మీ ప్రేమ, మార్గనిర్దేశకత్వమే ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఒక నాన్నగా ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించారు. నేను కూడా అలాగే అగస్త్యను పెంచాలని అనుకుంటున్నాను. మీకు నా ప్రేమలు. నిన్ను మిస్ అవుతున్నాను' అంటూ పోస్టు పెట్టాడు.హార్దిక్ పాండ్యాతో పాటు సురేష్ రైనా, సచిన్ టెండుల్కర్, సెహ్వాగ్, రషీద్ ఖాన్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

First published:

Tags: Fathers Day, Fathers Day 2021, Team India

ఉత్తమ కథలు