Home /News /sports /

HARDIK PANDYA AN D RAVINDRA JADEJA WANTS TO SAY GOOD BYE TO THEIR TEST CAREET WHAT IS THE REASON BEHIND THAT JNK

Test Cricket: టెస్ట్ క్రికెట్‌కు దూరమవుతున్న క్రికెటర్లు.. గాయాల భయమా? కెరీర్ కాపాడుకోవడం కోసమా?

టెస్ట్ ఫార్మాట్‌కు దూరమవుతున్న క్రికెటర్లు

టెస్ట్ ఫార్మాట్‌కు దూరమవుతున్న క్రికెటర్లు

Test Cricket: ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను ఏర్పాటు చేసింది. కానీ కొంత మంది క్రికెటర్లు మాత్రం గాయాల భయం, కెరీర్ పొడిగించుకోవాలనే కారణాలతో టెస్ట్ క్రికెట్‌కు దూరమవుతున్నారు.

ఇంకా చదవండి ...
  ఒకప్పుడు క్రికెట్ (Cricket) అంటే టెస్టు మ్యాచ్‌లే (Test Match). కానీ ఆ తర్వాత వన్డేలు, టీ20 వచ్చాక టెస్టు మ్యాచ్‌లకు ఆదరణ తగ్గిపోయింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు తిరిగి ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఐసీసీ (ICC) వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను (WTC) ఏర్పాటు చేసింది. ఈ మధ్య టెస్టు క్రికెట్‌లో ఉన్న మజాను ప్రేక్షకులు రుచి చూస్తూనే ఉన్నారు. కానీ అన్ని మ్యాచ్‌లకు అదే ఆదరణ ఉండటం లేదు. దీంతో టెస్టు మ్యాచ్‌ల సంఖ్య తగ్గిపోతున్నది. అదే సమయంలో టెస్ట్ క్రికెట్ ఆడాలనే ఉత్సాహం కూడా క్రికెటర్లలో తగ్గిపోతున్నది. దీనికి ముఖ్య కారణం ఫిట్‌నెస్. మిగిలిన ఫార్మాట్లతో పోల్చితే టెస్ట్ క్రికెట్ కోసం అత్యద్బుతమైన ఫిట్‌నెస్ అవసరం అవుతుంది. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాలన్నా.. ఫీల్డింగ్, బౌలింగ్ చేయాలంటే మామూలు ఫిట్‌నెస్ సరిపోదు. ఇక ఈ ఫార్మాట్‌లో గాయాల బారిన పడేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువ. ముఖ్యంగా బౌలర్లు, ఆల్‌రౌండర్లకు గాయాల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే సుదీర్ఘ కాలం టెస్ట్ క్రికెట్ ఆడే వాళ్ల సంఖ్య తక్కువ. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ దూసుకెళ్తున్న సమయంలో ఆటగాళ్లు కూడా సుదీర్ఘ ఫార్మాట్ కంటే వైట్ బాల్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

  టీమ్ ఇండియా క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు చాలా తక్కువ. బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలో ఆడుతుంటారు. అయితే ఆల్ రౌండర్లలో మాత్రం రవీంద్ర జడేజా ఒక్కడే మూడు ఫార్మాట్లలో ఆడటమే కాకుండా అద్బుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. అయితే ఇటీవల జడేజా తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు ముందు జడేజా గాయపడ్డాడు. తాజాగా న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడటంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. జడేజాకు అయిన గాయానికి తప్పకుండా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆరు నెలలకు జడేజా క్రికెట్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  Gautam Gambhir : " అతడు మరింత రెచ్చిపోతాడు.. ప్రత్యర్ధి జట్లకు చుక్కలే "
  ఐపీఎల్ 2022 సీజన్‌లోనే తిరిగి రవీంద్ర జడేజా మైదానంలో కనపడే అవకాశం ఉన్నది. దీంతో జడేజా మూడు ఫార్మాట్లలో ఆడేందుకు వెనకడుగు వేస్తున్నట్లు జడేజా సన్నిహితుడు ఒకరు 'దైనిక్ జాగరణ్' పత్రికతో చెప్పారు. సుదీర్ఘ ఫార్మాట్ వదిలేసి కేవలం వైట్ బాల్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నట్లు జడేజా సన్నిహితుడు వెల్లడించాడు. ప్రస్తుతం జడేజాకు వైట్ బాల్ క్రికెట్‌లో మంచి డిమాండ్ ఉన్నది. ఇటీవలే చెన్నయ్ సూపర్ కింగ్స్ యాజమాన్యం అతడిని రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకున్నది. గాయాల కారణంగా ఐపీఎల్‌కు దూరం అయితే మొత్తం కెరీర్‌కే నష్టం వస్తుందనే జడేజా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

  KS Bharath: భారీ సెంచరీతో దుమ్మురేపిన తెలుగు కుర్రాడు.. ఇక, ఐపీఎల్ వేలంలో జాక్ పాటే..!
  ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా జట్టులో చోటు కోల్పోయాడు. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా ఒక వెలుగు వెలిగిన పాండ్యా.. ఇప్పుడు జట్టులో చోటుకోసం కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గాయం నుంచి కోలుకున్న తర్వాత కేవలం వైట్ బాల్ క్రికెట్‌కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడు. సీనియర్ క్రికెటర్లు అయిన అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా గత కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేరు. టెస్ట్ జట్టులో రెగ్యులర్‌గా కనిపించేది వీరిద్దరే. వీరిద్దరూ టెస్టు క్రికెట్‌లో చోటు కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారు.

  Vijay Hazare Trophy: అత్యంత చెత్త రికార్డు.. ఆరుగురు బ్యాటర్లు డకౌట్.. 48కి ఆలౌట్.. 24 ఓవర్లలో ముగిసిన మ్యాచ్
  సీనియర్లను కనుక తప్పిస్తే.. వారిలో సహనంతో బ్యాటింగ్ చేసే వాళ్ల కోసం టీమ్ మేనేజ్‌మెంట్ వెతకాల్సిందే. వన్డే, టీ20లకు బెంచ్ చాలా బలంగా ఉన్నా.. టెస్టుల విషయంలో మాత్రం సరైన మిడల్ ఆర్డర్ బ్యాటర్ల కోసం వెతుక్కోవలసి వస్తుంది. అంతే కాకుండా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్లను ఇప్పటికిప్పుడు తయారు చేయడం కూడా కష్టమే. వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు ఆల్‌రౌండర్లే అయినా.. టెస్టుల్లో నిలకడగా ప్రదర్శన చేయగలరా అనేది పెద్ద డౌట్. అందుకే మరి కొన్నాళ్లు జడేజా లాంటి ఆటగాళ్లు టెస్టుల్లో కొనసాగడం మంచిదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: Hardik Pandya, Ravindra Jadeja, Team india, Test Cricket

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు