భారత జట్టు (Team India) మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) లోని ఒక ఫ్రాంచైజీకి కోచ్‌గా (Coach) పనిచేయనున్నట్లు తెలుస్తున్నది. 41 ఏళ్ల హర్భజన్ గత ఐపీఎల్ తొలి లెగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) (KKR) తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ లీగ్‌లోని యుఎఇ లెగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హర్భజన్ వచ్చే వారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అతడికి పలు ఫ్రాంచైజీల నుంచి సహాయక సిబ్బంది ఆఫర్లు వస్తున్నట్లు తెలిసింది. వాటిలో ఒక దానిని కెరీర్‌గా ఎంచుకునే అవకాశం ఉన్నది. హర్భజన్‌కు సన్నిహితుడైన ఒక వ్యక్తి అతడి భవిష్యత్ కార్యచరణను వివరించారు. హర్భజన్ ఏదైనా ఫ్రాంచైజీలు బౌలింగ్ కన్సల్టంట్, మెంటార్, కోచ్ వంటి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందన్నాడు. వేలంలో ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఫ్రాంచైజీకి సహాయం చేయడంలో కూడా అతను క్రియాశీల పాత్ర పోషిస్తాడు.
హర్భజన్ ఎప్పుడూ యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసేవాడు. సీనియర్ అయిన హర్భజన్ సింగ్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. ఒక దశాబ్దం పాటు ముంబై ఇండియన్స్‌తో కలసి క్రికెట్ ఆడాడు. అయితే అతడిని గత సంవత్సరం కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. భజ్జీకి కేకేఆర్ జట్టులో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయితే హర్భజన్.. వరుణ్ చక్రవర్తికి మార్గనిర్దేశం చేయడానికి చాలా సమయం గడిపాడు. ఐపీఎల్లో అరంగేట్రం చేయడానికి చాలా కష్టపడిన వెంకటేశ్ అయ్యర్‌కు కూడా నెట్ సెషన్లో విలువైన సలహాలు ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా అయ్యర్ తెలిపాడు.
Team India: నేడు దక్షిణాఫ్రికా వెళ్లనున్న టీమ్ ఇండియా ప్రకటన.. కోహ్లీకే వన్డే కెప్టెన్సీ?
టర్బోనేటర్గా ప్రసిద్ధి చెందిన భజ్జీ టీమ్ ఇండియా తరపున 103 టెస్టులు, 236 వన్డేలు మరియు 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. హర్భజన్ సింగ్ టెస్టుల్లో 417 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో ప్రపంచకప్ గెలవడం హర్భజన్ సింగ్ కెరీర్లో అతిపెద్ద విజయం. హర్భజన్ సింగ్ 1998 సంవత్సరంలో తన వన్డేల్లో అరంగేట్రం చేసాడు. అయితే అదే ఏడాదిలో అతని బౌలింగ్ యాక్షన్‌పై విచారణ కూడా ప్రారంభమైంది. అతని యాక్షన్ అనుమానాస్పదంగా గుర్తించబడింది. ఆ తర్వాత యాక్షన్‌లో మార్పు చేసి తిరిగి బౌలింగ్ ప్రారంభించాడు. ఈ సారి హర్భజన్ సింగ్ క్లీన్ చిట్ పొందాడు. ఆ తర్వాత అతను 2001 సంవత్సరంలో టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harbhajan singh, IPL 2022, Team India