ఎప్పుడూ ఏడుపేనా..? గిల్‌క్రిస్ట్‌పై విరుచుకుపడ్డ హర్భజన్ సింగ్‌..

ఈడెన్‌గార్డెన్‌ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో హర్భజన్‌సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించాడు.ఆ మ్యాచ్‌లో 72వ ఓవర్‌లో భజ్జీ వేసిన వరుస బంతులకు పాంటింగ్,గిల్‌క్రిస్ట్,షేన్ వార్న్ ఔటయ్యారు. అయితే అప్పట్లో డీఆర్ఎస్ సిస్టమ్ ఉండి ఉంటే.. తాను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి ఉండకపోయేవాడిని అని గిల్‌క్రిస్ట్ ట్విట్టర్‌లో ఎమోజీ రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

news18-telugu
Updated: September 4, 2019, 9:38 PM IST
ఎప్పుడూ ఏడుపేనా..? గిల్‌క్రిస్ట్‌పై విరుచుకుపడ్డ హర్భజన్ సింగ్‌..
హర్జజన్ సింగ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
భారత మాజీ ఆఫ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా క్రికెటర్ గిల్ క్రిస్ట్‌పై విరుచుకుపడ్డాడు. ఎప్పుడూ ఏడుపే.. అంటూ ఎద్దేవా చేశాడు. ట్విట్టర్‌ వేదికగా వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దమే జరిగింది.ఇంతకీ వీరిద్దరికి ఎందుకు పడిందంటే.. ఒకప్పటి హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ ఫీట్ గురించి గిల్‌క్రిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. ఇటీవల విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో డీఆర్ఎస్ రివ్యూ కోరి బుమ్రా హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో.. అప్పట్లోనూ ఇలా డీఆర్ఎస్ ఉండి ఉంటే.. హర్భజన్ హ్యాట్రిక్ సాధించకపోయి ఉండేవాడు అని గిల్‌క్రిస్ట్ కామెంట్ చేశాడు. గిల్‌క్రిస్ట్ కామెంట్స్‌కి భజ్జీ చిర్రెత్తిపోయాడు. 'డీఆర్ఎస్ లేకపోయి ఉంటే.. ఎక్కువసేపు ఆడేవాడిని అనుకుంటున్నావా..? ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావా..? కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అనే దానికి నువ్వే మంచి ఉదాహరణ.. ఎప్పుడూ ఏడుపే..' అంటూ ఫైర్ అయ్యాడు.

కాగా,ఈడెన్‌గార్డెన్‌ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో హర్భజన్‌సింగ్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఆ మ్యాచ్‌లో 72వ ఓవర్‌లో భజ్జీ వేసిన వరుస బంతులకు పాంటింగ్, గిల్‌క్రిస్ట్,షేన్ వార్న్ ఔటయ్యారు. అయితే అప్పట్లో డీఆర్ఎస్ సిస్టమ్ ఉండి ఉంటే.. తాను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి ఉండకపోయేవాడిని అని గిల్‌క్రిస్ట్ ట్విట్టర్‌లో ఎమోజీ రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆ ఏడుపు ఎమోజీకి భజ్జీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...