కరెంట్ బిల్లును చూసి షాకైనా హర్భజన్.. ఇంత బిల్‌లా అంటూ బోర్డుకు చురకలు

తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్. సాధరణంగా వచ్చే బిల్లు కంటే ఏడింతలు ఎక్కువగా వచ్చినట్లు హర్భజన్ వాపోయారు.

Rekulapally Saichand
Updated: July 27, 2020, 6:25 PM IST
కరెంట్ బిల్లును చూసి షాకైనా హర్భజన్.. ఇంత బిల్‌లా అంటూ బోర్డుకు చురకలు
హర్భజన్ సింగ్ (ఫైల్ ఫొటో)
  • Share this:
తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్. సాధరణంగా వచ్చే బిల్లు కంటే ఏడింతలు ఎక్కువగా వచ్చినట్లు హర్భజన్ వాపోయారు. తాజాగా ముంబయి ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి రూ.33,900 బాకీ ఉన్నట్లు వచ్చిన బిల్లును ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన బిల్లులో ఇతరులది కూడా కలిపేశారా అంటూ ఎలక్ట్రిసిటీ బోర్డును నిలదీశారు.


`ఇలా అధికమెుత్తంలో బిల్లులు వచ్చిన ఘటనలను చాలా సార్లు చూశాం. సామాన్యుల నుంచి సెలబ్రెటిల వరకు ఇలాంటి అనుభావాన్ని ఎదురుకున్నావారే. ఇంతకుముందు బాలీవుడ్‌ నటి తాప్సీ సైతం ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఎవరూ ఉండని తన పాత ఇంటికి రూ.36 వేలు బిల్లు వచ్చిందని పెర్కొంది. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకం చూశాం. తాజాగా క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కోన్నారు.

మరోవైపు ఇనాళ్ళు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న స్పోర్ట్స్ ఈవెంట్స్ మళ్ళీ అరంభమయ్యాయి. ఐపీఎల్ 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి మెుదలుకానుంది. అన్ని జట్లు అక్కడ వెళ్ళడానికి సిద్దమవుతున్నాయి. ఫ్రాంఛైజీల కన్నా ముందే చెన్నై జట్టు అక్కడికి చేరుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం సభ్యుడైన హర్భజన్‌ కూడా త్వరలోనే యూఏఈకి పయనం కానునున్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 27, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading