టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధం...సెలక్టర్లపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు...

టీమ్ ఇండియాకు దూరంగా భారత స్టార్ స్పిన్నర్ హర్భజన్ మరోసారి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే తాను టీ 20 ఫార్మాట్ ఆడేందుకు ఇస్టపడుతున్నానని తెలిపాడు.

news18-telugu
Updated: May 25, 2020, 3:28 PM IST
టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధం...సెలక్టర్లపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు...
హర్భజన్ సింగ్
  • Share this:
చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా భారత స్టార్ స్పిన్నర్ హర్భజన్  మరోసారి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే తాను టీ 20 ఫార్మాట్ ఆడేందుకు ఇస్టపడుతున్నానని తెలిపాడు. అంతేకాదు ఆ ఫార్మాట్ లో తాను ఖచ్చితంగా సరిపోతాడని అతను పేర్కొన్నాడు. 2016 నుండి జట్టులో రీఎంట్రీ కోసం హర్భజన్ సింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే తాను టీ 20 ఫార్మాట్‌లో బాగా రాణించగలనని చెప్పాడు. క్రిక్ ఇన్ఫో సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పలు అనుభవాలను పంచుకున్నాడు. ఇక ఐపీఎల్ పై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఐపిఎల్ టోర్నీఅనేది బౌలర్లకు చాలా కష్టమైన టోర్నమెంట్ అని పేర్కొన్నాడు. ఎందుకంటే ఈ ఫార్మాట్ లో మైదానం చిన్నగా ఉంటుందని, అలాగే ప్రపంచ స్థాయి క్రికెటర్లు బరిలో నిలుస్తారని పేర్కొన్నాడు. ప్రస్తుతం మేటి బ్యాట్స్ మెన్ లను ఇబ్బంది పెట్టే టెక్నిక్ తనవద్ద ఉందని పేర్కొన్నాడు. అలాగే టీమిండియా తరపున టి 20 క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించినట్లయితే, అంతర్జాతీయ పక్రికెట్ లో కూడా బాగా రాణించగలమని భజ్జీ పేర్కొన్నాడు. ప్రధానంగా పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి తాను వికెట్లు తీశానని హర్భజన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్, వికెట్లను తీసుకోవడంలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. టి 20 పరంగా ఐపిఎల్ కఠినమైన టోర్నమెంట్ అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు అందులో రాణించడం ద్వారా టీమ్ ఇండియాకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు భజ్జీ తెలిపాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్‌లాంటి నాణ్యమైన ఆటగాళ్లు లేరని, ఇక్కడ ప్రతి జట్టులో మొదటి ఆరు ఆటగాళ్లు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా మంచి బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉన్నాయని, ఐపీఎల్‌లో జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ వికెట్లు తీయగలిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు తిరుగు ఉండదని భజ్జీ పేర్కొన్నాడు.

అయితే తన ప్రదర్శన బాగున్నప్పటికీ, సెలెక్టర్లు శ్రద్ధ చూపడం లేదని, ఇదే విషయం తనను బాధిస్తుందని హర్భజన్ అన్నారు. సెలెక్టర్లు తమను ముసలివాళ్లు అనుకుంటన్నారని భజ్జీ విమర్శించాడు. గడచిన నాలుగేళ్లుగా సెలక్టర్లు తనవైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించాడు.
First published: May 25, 2020, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading