చైనా మన కోసం మరో వైరస్‌ను సిద్దం చేసింది:హర్భజన్


Updated: July 1, 2020, 10:33 AM IST
చైనా మన కోసం మరో వైరస్‌ను సిద్దం చేసింది:హర్భజన్
హర్బజన్ సింగ్
  • Share this:
స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ చైనాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సృష్టించింది చైనానే అంటూ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం డ్రాగన్‌ దేశంలో మరో వైరస్ కనుగొన్నారనే వార్తలపై భజ్జీ స్పందించాడు. స్వైన్ ఫ్లూ రకానికి చెందిన మరో వైరస్ చైనాలో గుర్తించారని రాయిటర్స్ రాసిన కథనాన్ని ఆయన రీట్వీట్ చేశారు. "ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతుంటే  చైనా మన కోసం మరో వైరస్‌ను సృష్టించదంటూ" తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

 
కాగా డ్రాగన్‌లో మరో వైరస్ కనుగొన్నారనే వార్తలు ప్రపంచాన్ని కలవపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా వివిధ దేశాలు సతమతమవుతుంటే ఈ వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ వేగంగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని స్వైన్‌ ఫ్లూ వైరస్‌ కంటే అది ఎంతో ప్రమాదకరమైనదని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్‌ఏఎస్‌ తన కథనంలో పేర్కొంది. స్వైన్‌ ఫ్లూ వ్యాధికి కారణమయే హెచ్‌1ఎన్‌1 వైరస్ జాతి నుంచే ఈ వైరస్ వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఈ వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నట్లు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు తెలిపారు.
First published: July 1, 2020, 10:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading