Home /News /sports /

Neeraj Chopra: నీరజ్ చోప్రా స్వర్ణంపై హర్భజన్ సింగ్, గంభీర్ గొడవ.. సోషల్ మీడియాలో రచ్చ

Neeraj Chopra: నీరజ్ చోప్రా స్వర్ణంపై హర్భజన్ సింగ్, గంభీర్ గొడవ.. సోషల్ మీడియాలో రచ్చ

నీరజ్ చోప్రాకు స్వర్ణం.. ఇద్దరు క్రికెటర్ల మధ్య మాటల యుద్దం (Twitter)

నీరజ్ చోప్రాకు స్వర్ణం.. ఇద్దరు క్రికెటర్ల మధ్య మాటల యుద్దం (Twitter)

భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంతో దేశమంతా సంబురాలు చేసుకుంటున్నది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు క్రికెటర్లు ఈ విజయాన్ని పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు గొడవగా మారింది. హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంకా చదవండి ...
    భారత ఒలింపిక్ (Olympics) చరిత్రలో 100 ఏళ్ల తర్వాత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణం (Gold) సాధించి సరికొత్త అధ్యాయానికి తెర తీశాడు. ఇకపై అథ్లెటిక్స్ అంటే నీరజ్ గోల్డ్‌కు ముందు గోల్డ్‌కు తర్వాత లాగా మారిపోయింది. ఫైనల్ రౌండ్‌లో జావెలిన్‌ను రెండో ప్రయత్నంలో 87.58 మీట్ల దూరం విసిరాడు. మిగిలిన ఫైనలిస్టులు నీరజ్‌ను బీట్ చేయలేకపోయారు. మొత్తానికి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్ర తర్వాత స్వర్ణం గెలిచిన రెండో భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్రలో నిలిచిపోనున్నాడు. చోప్రా స్వర్ణం గెలిచిన తర్వాత అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఎంతో మంది సెలెబ్రిటీలు, సాటి అథ్లెట్లు అతడి విజయంపై ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అతడి ట్వీట్‌పై సహచర మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Goutham Gambhir) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు అలాంటి ట్వీట్ నువ్వు పెట్టాల్సింది కాదని గంభీర్ విరుచుకపడ్డాడు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే..

    నీరజ్ పతకం గెలిచిన తర్వాత హర్భజన్ సింగ్ ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టు 2011లో గెలిచిన వరల్డ్ కప్ కంటే నీరజ్ చోప్రా విజయం చాలా గొప్పదని అన్నాడు. నీరజ్ చోప్రాను పొగుడుతూ హర్భజన్ సింగ్ పదే పదే ఈ మాటలు ఉపయోగించాడు. అయితే ఈ క్లిప్పింగ్‌ను సదరు చానెల్ కూడా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను గమనించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. 'హర్భజన సింగ్ నువ్వు చెప్పింది నిజమే కావొచ్చు.. కానీ నువ్వు ఈ మాటలు అనకూడదు.. అసలు నువ్వు ఈ మాట చెప్పి ఉండకూడదు.. ఇలాంటి వ్యాఖ్యలు మనం ఎక్కడా చేయకూడదు' అంటూ నోర్మూసుకో అనే ఎమోజీని జత చేశాడు. స్వయంగా క్రికెటర్ అయ్యుండు.. ఆనాటి జట్టులో ఉన్న అతడు తమ విజయాన్ని చిన్నదిగా చెప్పుకోవడంపై గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.





    కాగా, హర్భజన్ సింగ్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన గౌతమ్ గంభీర్ టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ టీమ్‌ను కొనియాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో హాకీ టీమ్ గెలిచిన పతకం 2011 క్రికెట్ వరల్డ్ కప్ కంటే గొప్పదని ట్వీట్ చేశాడు. అప్పుడు తానే అలా అని.. ఇప్పుడు హర్బజన్‌కు సూక్తులు చెప్పడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వీరిద్దరి వివాదం నెటిజన్లకు వినోదం పంచుతున్నది.

    ఇది కూడా చదవండి : Neeraj Chopra: పతకవీరుడు నీరజ్‌కు డబ్బే డబ్బు.. ఎవరు ఎంత నజరానా ఇస్తున్నారో తెలుసా?
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cricket world cup 2011, Gautam Gambhir, Harbhajan singh, Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు