#HappyBirthdaySachin : నేడు క్రికెట్ దేవుడు సచిన్ 46వ పుట్టిన రోజు

Happy Birthday Sachin : పదహారేళ్ల వయసులో పాకిస్తాన్‌పై మ్యాచ్‌తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే డాన్ బ్రాడ్‌మాన్ లాంటి దిగ్గజాల సరసన సచిన్ చేరిపోయాడు. రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ-20 ఆడిన సచిన్.. మొత్తం 34357 పరగులు చేశాడు.

news18-telugu
Updated: April 24, 2019, 11:09 AM IST
#HappyBirthdaySachin : నేడు క్రికెట్ దేవుడు సచిన్ 46వ పుట్టిన రోజు
సచిన్ టెండూల్కర్ (File)
news18-telugu
Updated: April 24, 2019, 11:09 AM IST
భారత క్రికెట్‌లో ఎవరెస్ట్ అంతటి దిగ్గజం.. అభిమానులు క్రికెట్ గాడ్‌గా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్.. నేడు సచిన్ టెండూల్కర్ 46వ జన్మదినం. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు గడిచిపోయినా.. సచిన్‌కే సాధ్యమైన క్లాస్ బ్యాటింగ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. నేడు ఆయన జన్మదినం సందర్భంగా సచిన్ రికార్డుల గురించి అభిమానులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

సచిన్ పూర్తి పేరు సచిన్ రమేశ్ టెండూల్కర్. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న దాదర్‌లో 1973లో ఆయన జన్మించారు. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రముఖ మరాఠీ నవలాకారుడు. సంగీత విద్వాంసుడు సచిన్ దేవ్ బర్మన్‌పై ఉన్న అభిమానంతో తన కుమారుడికి సచిన్ అని పేరు పెట్టాడు. పదహారేళ్ల వయసులో పాకిస్తాన్‌పై మ్యాచ్‌తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే డాన్ బ్రాడ్‌మాన్ లాంటి దిగ్గజాల సరసన సచిన్ చేరిపోయారు. రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ-20 ఆడిన సచిన్.. మొత్తం 34357 పరగులు చేశారు. వన్డేల్లో మొట్టమొదటిసారిగా 200 పరుగులు సాధించిన క్రికెటర్ గానూ రికార్డులకెక్కాడు. సచిన్ అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడగా.. చివరి టోర్నీలో వరల్డ్ కప్ కల నెరవేరింది.

నవంబర్ 2013లో సచిన్ తన చివరి మ్యాచ్‌ను వెస్టిండీస్‌పై ఆడారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ సచిన్‌ కెరీర్‌లో 200వ టెస్ట్. ఇక ముంబై తరుపున ఐపీఎల్‌లోనూ ఆడిన సచిన్.. 79 మ్యాచ్‌ల్లో 2334 పరుగులు సాధించారు. ఇందులో 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సచిన్ పుట్టినరోజు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.





First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...