Home /News /sports /

HAPPY BIRTHDAY AJINKYA RAHANE HERE ARE SOME UNKNOWN FACTS ABOUT TEAM INDIA STAR PLAYER JINKS SRD

Happy Birthday Ajinkya Rahane: బ్యాటుతోనే కాదు కరాటేలోనూ ఇరగదీస్తాడు... రహానే గురించి ఈ విషయాలు తెలుసా..?

Ajinkya Rahane

Ajinkya Rahane

Happy Birthday Ajinkya Rahane: ఐపీఎల్‌ 2022 సీజన్ లో గాయం కారణంగా టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. కోల్‌కతా తరఫున ఆడుతున్న సమయంలో కండరాల గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు.

    టీమిండియా (Team India) టెస్ట్ ఫార్మాట్ స్టార్ ప్లేయర్ అజింక్య రహానే (Ajinkya Rahane) కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. గాయంతో ఇప్పటికే టెస్ట్ జట్టుకు దూరమైన రహానే.. ఫామ్ లేమితో నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తన బ్యాటింగ్ తో టెస్ట్ ఫార్మాట్ లో భారత్ కు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన జింక్స్.. తన 34 వ పుట్టినరోజును ఈ రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు అతని గురించి తెలుసుకుందాం. రహానే క్రికెట్‌తో పాటు కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. రెండు క్రీడలతో సంబంధం ఉన్న కొద్దిమంది ఆటగాళ్లలో రహానె ఒకరు.

    టీమిండియా చెందిన ఈ బ్యాటర్ 12 సంవత్సరాల వయసులో కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈ రోజు కూడా, తనకు అవకాశం వచ్చినప్పుడల్లా, అతను కరాటే సాధన చేస్తుంటాడు. ఐపీఎల్ 2012 మ్యాచ్‌లో రహానే ఒక ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టాడు. అప్పుడు రహానె రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచులో రహానె నాటౌట్ 103 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన అతికొద్ది బ్యాటర్లలో రహానే ఒకడు.

    2015లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రహానే 8 క్యాచ్లు పట్టుకున్నాడు. దీంతో ఒక టెస్టు మ్యాచులో వికెట్ కీపర్ కాకుండా అత్యధిక క్యాచులు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. రహానే తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు ఒడిసిపట్టాడు. రహానే తన బాల్య స్నేహితురాలు రాధికను 25 నవంబర్ 2014 న వివాహం చేసుకున్నాడు. రాధిక ఇల్లు రహానే ఇంటి పరిసరాల్లో ఉంది. అజింక్య రహానె దైవభక్తి మెండుగా ఉంది. సాయి బాబా, గణేశుడిపై ఆయనకు ప్రత్యేక విశ్వాసం ఉంది.


    ఇక, ఐపీఎల్‌ 2022 సీజన్ లో గాయం కారణంగా టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. కోల్‌కతా తరఫున ఆడుతున్న సమయంలో కండరాల గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు.

    ఇది కూడా చదవండి :  రాహుల్ ఆ తప్పు మళ్లీ చేస్తే ఈ సారి కష్టమే.. అసలకే ఆ నలుగురు నుంచి తీవ్రపోటీ..!

    ట్రీట్‌మెంట్‌ కోసం మరోసారి బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాసం కోసం వెళ్తున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రహానే 133 పరుగులు చేశాడు. మరోవైపు రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు సాధించింది టీమిండియా. రహానే కెప్టెన్సీలో భారత్ అద్భుతంగా ఆడింది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, అశ్విన్ వంటి స్టార్ ప్లేయర్లు దూరమైనా.. కుర్రాళ్లతో ఆసీస్ గడ్డపై మరుపురాని విజయాన్ని అందించాడు జింక్స్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IPL 2022, Kolkata Knight Riders, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు