Rohit Sharma : 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ లో టీమిండియా (Team India) జెర్సీని తొలిసారి వేసుకున్న రోహిత్ శర్మ (Rohit Sharma) అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకున్నాడు. అయితే రోహిత్ శర్మ ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక ఎత్తు పల్లాలను చూడాల్సి వచ్చింది. క్రికెట్ పట్ల అతడికి ఉన్న అంకిత భావం నేడు ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టును తన కెప్టెన్సీలోనే ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన ఘనత రోహిత్ కే దక్కింది. నేడు రోహిత్ శర్మ తన 35వ జన్మదినాన్ని జరుపుకోనున్నాడు. ఈ క్రమంలో అతడికి ముంబై ఇండియన్స్ ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (Tilak Verma) అద్భుత గిఫ్ట్ ను కానుకగా ఇచ్చాడు.
ఇది కూడా చదవండి : డికాక్ ను చూసి చాలా మంది క్రికెటర్లు బుద్ధి తెచ్చుకోవాల్సిందే..!
ఏప్రిల్ 30వ తేదీన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తన 35వ జన్మదిన వేడుకను జరపుకోనున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ.. తన ట్విట్టర్ లో రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ’రోహిత్ భాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చిన్నతనం నుంచి మీరే నా స్ఫూర్తి.. ఇప్పటికీ మీ నుంచి స్ఫూర్తి పొందుతూనే ఉన్నా‘ అంటూ రోహిత్ శర్మకు తన వంతుగా బర్త్ డే కానుకను ట్వీట్ రూపంలో ఇచ్చాడు. అంతేకాకుండో రోహిత్ శర్మ తో దిగిన ఒక ఫోటోను కూడా తిలక్ వర్మ ఈ ట్వీట్ తో అభిమానులతో పంచుకున్నాడు.
Happy birthday @ImRo45 bhai 😊 My inspiration since I was a youngster, and inspiring me every day now at @mipaltan 💙 pic.twitter.com/OP13C33CNJ
— Tilak Varma (@TilakV9) April 29, 2022
అయితే రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో చెత్త ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ ఓడి పాయింట్ల ఖాతా తెరవకుండా పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ లో కోట్లు వెచ్చించిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమవుతుండగా.. రోహిత్ శర్మ, పొలార్డ్ పూర్ ఫామ్ తో ముంబై ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమే బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. ఇక ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటూ అంత మంచింది. బుమ్రా కూడా పెద్దగా రాణించడం లేదు. ఇక నేడు రాజస్తాన్ రాయల్స్ (Rajsthan Royals)తో ముంబై ఇండియన్స్ తలపడాల్సి ఉంది. అయితే పటిష్ట రాజస్తాన్ ను ఓడించాలంటే మాత్రం ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. పుట్టిన రోజు నాడు ముంబై ఇండియన్స్ కు సీజన్ లో తొలి విజయం రుచిని చూపిస్తాడో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2022, Jasprit Bumrah, Kieron pollard, Mumbai Indians, Rajasthan Royals, Rohit sharma, Sanju Samson, Team India, Virat kohli