ఓవల్ టెస్ట్ : భారత తుది జట్టులో తెలుగు తేజం 'హనుమ విహారి'

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌కు ఎంపిక చేసిన భారత తుది జట్టులో తెలుగు తేజం హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు.ఆధారపడదగ్గ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న 25 ఏళ్ల ఆంధ్ర క్రికెటర్‌కే కెప్టెన్ విరాట్ కొహ్లీ, కోచ్ రవిశాస్త్రి మొగ్గుచూపారు.

news18-telugu
Updated: September 7, 2018, 3:38 PM IST
ఓవల్ టెస్ట్ : భారత తుది జట్టులో తెలుగు తేజం 'హనుమ విహారి'
హనుమ విహారి (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: September 7, 2018, 3:38 PM IST
ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారికి అదృష్టం కలిసొచ్చింది.ట్రెడిషనల్ ఫార్మాట్‌లో టాప్ ర్యాంకర్‌గా ఉన్న టీమిండియా టెస్ట్ జట్టులో ఎట్టకేలకు చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌కు ఎంపిక చేసిన భారత తుది జట్టులో తెలుగు తేజం హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లోని ఆఖరి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టులో హనుమ విహారీతో పాటు పృథ్వీ షా భారత జట్టుకు ఎంపికయ్యారు.ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించడంతో...సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాల్గవ టెస్ట్‌కు కూడా అదే జట్టును కొనసాగించారు.కానీ సౌతాంప్టన్ టెస్ట్‌లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఘోరంగా ఓడిపోయి సిరీస్ కోల్పోవడంతో విమర్శలు ఎదుర్కొంది.దీంతో ఆఖరి టెస్ట్‌కు పృథ్వీ షా ఎంపికవ్వడం ఖాయమనుకున్నారంతా. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ భారత టీమ్ మేనేజ్‌మెంట్ హనుమ విహారిని ఎంపిక చేసింది.ఆధారపడదగ్గ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న ఈ 24 ఏళ్ల ఆంధ్ర క్రికెటర్‌కే కెప్టెన్ విరాట్ కొహ్లీ, కోచ్ రవిశాస్త్రి మొగ్గుచూపారు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 292వ ఆటగాడిగా విహారి రికార్డ్‌లకెక్కాడు.
ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన విహారి దేశవాళీ క్రికెట్‌లో 2017-18 సీజన్‌లో నిలకడగా రాణించాడు. 63 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 59.7 సగటుతో 5,142 పరుగులు చేశాడు.ఇందులో 15 సెంచరీలు,24 హాఫ్ సెంచరీలున్నాయి.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో విహారి అత్యధిక స్కోర్ 302 పరుగులు.ఇండియాకు టెస్ట్‌ల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ఆటగాడు హనుమ విహారి అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసిసిఐ) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
First published: September 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...