హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ టికెట్ ధర రూ. 2 లక్షలు.. బ్లాక్‌లో కూడా ఎగబడి కొంటున్న అభిమానులు

WTC Final : వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ టికెట్ ధర రూ. 2 లక్షలు.. బ్లాక్‌లో కూడా ఎగబడి కొంటున్న అభిమానులు

చుక్కలనంటిన డబ్ల్యూటీసీ ఫైనల్ టికెట్ ధరలు (PC: ECB)

చుక్కలనంటిన డబ్ల్యూటీసీ ఫైనల్ టికెట్ ధరలు (PC: ECB)

ఇంగ్లాండ్‌లో ఏడాది తర్వాత ప్రేక్షకులను క్రికెట్ స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. పైగా జరగబోయేది వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కావడంతో అందుబాటులో ఉన్న టికెట్లకు భారీ డిమాండ్ పెరిగింది. ఒక్కో టికెట్ రూ. 2 లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తున్నది.

ఇంకా చదవండి ...

ఐసీసీ (ICC) తొలిసారిగా నిర్వహిస్తున్న వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ ఫైనల్)(WTC Final)కు ప్రేక్షకులను అనుమతించాలని హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ నిర్ణయించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి కరోనా నిబంధనల మేరకు బయోబబుల్ వాతావారణంలో ఇంగ్లాండ్ మైదానాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండటంతో ప్రేక్షకులను (Spectators) అనుమతించడం లేదు. దాదాపు ఏడాది తర్వాత తొలి సారిగా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను మ్యాచ్ వీక్షించడానికి అనుమతించాలని ఈసీబీ నిర్ణయించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కు రోజుకు 4 వేల టికెట్లు (Tickets) చొప్పున అమ్మాలని హాంప్‌షైర్ నిర్ణయించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాన్ని కూడా మొదలు పెట్టింది. ఐసీసీ స్పాన్సర్లు, భాగస్వాములను 2 వేల టికెట్లు కేటాయించగా.. మిగిలిన 2 వేల టికెట్లను అభిమానులకు అందుబాటులో ఉంచినట్లు హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ చీఫ్ రోడ్ బ్రన్స్ వెల్లడించారు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం కెపాసిటీ 25 వేలు కాగా, అభిమానులకు అందుబాటులో 2 వేల టికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. హాంప్‌షైర్ క్లబ్ ఇప్పటికే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నది.

మరోవైపు ఈ మ్యాచ్‌కు న్యూజీలాండ్ నుంచి భారీ సంఖ్యలో ప్రేక్షకులు రానున్నారు. స్థానికంగా ఉండే భారత అభిమానులతో పాటు న్యూజీలాండ్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతుండటంతో ఒక్క టికెట్ ధర రూ. 2 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఇక బ్లాక్ మార్కెట్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ టికెట్ రేట్లు మరింతగా పెరిగిపోయాయి. అయినా సరే అభిమానులు ఎంత వెచ్చించైనా టికెట్లు కొనడానికి రెడీ అయిపోతున్నారు. సాధారణంగా ఇంగ్లాండ్‌లో వేసవి కాలం విడిదికి న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఈ మ్యాచ్ ద్వారా టూరిస్టులను ఆకర్షించాలని పలు ట్రావెల్ ఏజెన్సీలు కూడా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. పూర్తి కరోనా భద్రత పాటిస్తూ.. మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని కారణంగా కూడా టికెట్ ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుతో కివీస్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నది. భారత జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లనున్నది. అక్కడ సౌతాంప్టన్ హోటల్‌లో మూడు రోజుల క్వారంటైన్ ఉన్న తర్వాత క్రికెట్ సాధన మొదలు పెట్టనున్నది. జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న అరంగేట్రం వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఏడు చానల్స్‌లో ప్రసారం చేయనున్నది.

First published:

Tags: Cricket, ICC, India vs newzealand, Team India, WTC Final

ఉత్తమ కథలు