ప్రముఖ క్రికెటర్‌ కపిల్ దేవ్‌కే గుండు గీసిన ఆమ్మాయి.. ఎవరో తెలుసా..

కపిల్ దేవ్ (ఫైల్ ఫోటో)

అమియా హేయిర్‌ను చాలా చిన్నగా కట్ చేసింది. దీంతో అదీ కాస్త గాడి తప్పి కపిల్ దేవ్ నున్నగా గుండు గీయించుకోవాల్సి వచ్చింది.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ నిబంధనల వల్ల గల్లీలో తిరిగే వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ప్రతిఒక్కరికీ ఇబ్బందులు తప్పడం లేదు. అలాగని రోడ్లపైకి వస్తే.. కరోనా వైరస్ బారిన పడి ఏకంగా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదఉంది. ఈ పరిస్థితి ఓ ప్రముఖ క్రికెటర్‌కు తప్పలేదు. టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు జుట్టు బాగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ వల్ల తన కూతురు అమియా హేయిర్ కట్ చేయించుకునేందుకు ప్రయత్నించాడు. అమియా హేయిర్‌ను చాలా చిన్నగా కట్ చేసింది. దీంతో అదీ కాస్త గాడి తప్పి కపిల్ దేవ్ నున్నగా గుండు గీయించుకోవాల్సి వచ్చింది. గుండు కావడంతో కపిల్ దేవ్ ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకుని న్యూ లుక్‌తో అదరగొట్టాడు. లాక్‌డౌన్ సమయంలో భార్య, కూతురికి ఇంటి పనుల్లో సాయపడుతున్నట్టు కపిల్ తెలిపారు. కపిల్ న్యూ లుక్‌పై సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ న్యూలుక్ ఎంతో బాగుందని, దాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు.
    Published by:Narsimha Badhini
    First published: